ఇప్పుడు ఈ వార్త టాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. కళ్యాణ్ రామ్ నిజంగానే ఇంత సాహసమైన నిర్ణయం తీసుకున్నాడా? అనే ప్రశ్నకు సమాధానం “అవును” అని అనేక కామెంట్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, కళ్యాణ్ రామ్ తన తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ కోసం చేస్తున్న కొత్త చిత్రంలో విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారని టాక్. ఈ రోల్ పూర్తిగా నెగిటివ్ షేడ్స్‌తో కూడిన పవర్‌ఫుల్ క్యారెక్టర్ అని తెలుస్తోంది. ఇప్పటివరకు కళ్యాణ్ రామ్‌ని ఇలాంటి కోణంలో ప్రేక్షకులు ఎప్పుడూ చూడలేదు. హీరోగా మాత్రమే కాకుండా, విలన్‌గా కూడా తన స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


ముఖ్యంగా కొంతమంది సినీప్రేమికులు “కళ్యాణ్ రామ్ హీరోగా కాకుండా విలన్ క్యారెక్టర్‌లో చాలా సూట్ అవుతాడు” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఆయన కళ్లలోని ఫైర్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ—అన్ని మ్యాచ్ అవుతాయ్  అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.ఇక ఈ భారీ చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించబోతున్నారని టాక్. జూనియర్ ఎన్టీఆర్త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌కు “మురుగన్” అనే వర్కింగ్ టైటిల్ నడుస్తోందట. ఈ సినిమాలో కీలకమైన నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కోసం కళ్యాణ్ రామ్‌ను తీసుకోవాలని చిత్ర బృందం ఆలోచనలో ఉందని వార్తలు చెబుతున్నాయి.



ఇంకా ఈ విషయంపై అధికారిక ప్రకటన  రాలేదు. కానీ టాలీవుడ్ మీడియాలో మరియు ఫ్యాన్స్ వర్గాల్లో ఈ వార్త పెద్ద స్థాయిలో వైరల్ అవుతోంది. కొంతమంది ఫ్యాన్స్ అయితే ఇది నిజం కావాలని ఆశపడుతున్నారు. “ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ ఒకే ఫ్రేమ్‌లో, అది కూడా హీరో-విలన్‌గా వస్తే, అదొక విజువల్ ఫీస్ట్ అవుతుంది” అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ వార్తతో నందమూరి అభిమానుల్లో హైప్ పెరిగింది. త్రివిక్రమ్ స్టైలిష్ నారేటివ్‌లో కళ్యాణ్ రామ్ నెగిటివ్ షేడ్స్‌లో కనిపిస్తే, అది టాలీవుడ్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ చర్చలన్నీ సోషల్ మీడియాలో టాప్ ట్రెండ్‌గా మారాయి.ఇక మూవీ మేకర్స్ నుంచి అధికారిక అప్డేట్ వస్తే, ఇది వచ్చే ఏడాది అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌గా నిలుస్తుందనడంలో సందేహమే లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: