విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించే డైరెక్టర్లలో డైరెక్టర్ సెల్వ రాఘవన్ కూడా ఒకరు. ఈయన డైరెక్టర్గా తెరకెక్కించిన చిత్రాలలో 7/G బృందావన కాలనీ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా 2004 లో విడుదలై క్లాసికల్ హిట్టుగా నిలిచింది. ఈ చిత్రంలో హీరోగా రవికృష్ణ, హీరోయిన్గా సోనియా అగర్వాల్ నటించారు. ఈ సినిమాలోని కామెడీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. పాటలు కూడా అద్భుతంగా ఆకట్టుకున్నాయి.అయితే మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు 7/G బృందావన కాలనీ సినిమాకి సీక్వెల్ తెరకెక్కించాలనే ఆలోచన డైరెక్టర్ కి కలిగింది.


ఈ సినిమాకి సంబంధించి పోస్టర్ ను కూడా విడుదల చేశారు. అయితే ఈ చిత్రంలో హీరో, హీరోయిన్స్ గా ఎవరు నటిస్తారని విషయంపై ప్రేక్షకులు చాలా ఎక్సైటింగ్ గాని ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే సోనియా అగర్వాల్ గతంలో డైరెక్టర్ సెల్వ రాఘవన్ ను వివాహం చేసుకొని విడాకులు తీసుకుంది. మరి ఇప్పుడు ఈమెకు అవకాశం ఇస్తారా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. మొదటి భాగం విడుదలై పదేళ్ల తర్వాత ఇప్పుడు రెండో భాగం ప్రకటించడంతో మరింత ఉత్కంఠతను పెంచేస్తోంది. గడిచిన కొద్దిరోజుల క్రితం 7/G బృందావన కాలనీ 2 పోస్టర్ ని కూడా విడుదల చేయగా అందులో డైరెక్టర్, సంగీత దర్శకుడు ,కెమెరామెన్ పేర్లు మాత్రమే వేశారు.


అయితే ఇంకా నటీనటుల గురించి ఎటువంటి విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఇందులో గతంలో నటించిన రవికృష్ణ నే ఈసారి కూడా హీరోగా నటించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. హీరోయిన్గా మలయాళం నటిని తీసుకోబోతున్నట్లు జోరుగా అయితే ప్రచారం జరుగుతోంది. ఆ నటి ఎవరో కాదు అనశ్వర రాజన్. ఈ ముద్దుగుమ్మ ఈ సీక్వెల్లో నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్న. అనశ్వర రాజన్ మలయాళంలో కూడా పలు సినిమాలలో నటించి బాగానే క్రేజీ సంపాదించింది. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్గానే కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: