మనందరికీ తెలిసిందే, భారతీయ సినిమా రంగంలో ప్రతిష్టాత్మక దర్శకుడు రాజమౌళి గారు ప్రస్తుతం మహేష్ బాబు ప్రధాన పాత్రలో ఒక భారీ యాక్షన్ అడ్వెంచర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ గురించి అధికారిక ప్రకటన వెలువడకముందే అభిమానుల్లో, సినీ వర్గాల్లో, అంతర్జాతీయ స్థాయిలోనూ అంచనాలు ఆకాశాన్నంటాయి. ఎందుకంటే, రాజమౌళి ప్రతి సినిమా ప్రపంచ స్థాయి మైలురాయిగా నిలుస్తుంది అనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. ‘బాహుబలి’ మరియు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లాంటి ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించిన చిత్రాల తర్వాత, ఆయన చేతుల్లో ఉన్న ఈ కొత్త ప్రాజెక్ట్‌ పై ఆసక్తి సహజమే.


ఇది సినిమా పాన్ ఇండియా సినిమా మాత్రమే కాదు, పాన్ వరల్డ్ లెవల్ ప్రాజెక్ట్‌గా రూపొందుతోందని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. రాజమౌళి గారు తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారితో కలిసి కథ, స్క్రీన్‌ప్లే మీద నెలల తరబడి కృషి చేశారు. అఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోందనే వార్తలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్‌ను మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ తో పాటు, మహేష్ బాబు ఇంట్రడక్షన్ వీడియోను మరియు ఒక స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ఈవెంట్‌ను సాధారణ ప్రమోషనల్ ఫంక్షన్‌లా కాకుండా, అత్యంత భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం దేశంలోని ప్రముఖ ఈవెంట్ మేనేజ్‌మెంట్ టీమ్‌ను ప్రత్యేకంగా నియమించినట్లు సమాచారం.



ఈ టైటిల్ రివీల్ ఈవెంట్‌కు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే, ఈ కార్యక్రమానికి హాజరయ్యే మీడియా ప్రతినిధులు మరియు అతిథులు ఎవరూ కెమెరాలు లేదా మొబైల్ ఫోన్లు తీసుకురావద్దని నిర్వాహకులు కఠినమైన నియమాలు విధించారు. మొదట్లో మీడియాకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని అనుకున్నారు, కానీ తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ నియమం ప్రతి ఒక్కరికి వర్తించబోతోందట. అంటే ఈవెంట్‌లో పాల్గొనే ప్రతి వ్యక్తి తన మొబైల్ ఫోన్‌ను ప్రవేశద్వారం వద్దే నిర్వాహకులకు సమర్పించాల్సి ఉంటుందట. ఈ ఫోన్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెక్యూరిటీ లాకర్‌లలో భద్రపరచి, ఈవెంట్ ముగిసిన తర్వాత తిరిగి హ్యాండ్ ఓవర్ చేయనున్నారు.ఈ సరికొత్త విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. “జక్కన్న  ఏదో భారీ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడని ఖచ్చితంగా తెలుస్తోంది” అని అభిమానులు అంటున్నారు. ఆయన సినిమాల ప్రమోషన్‌కు ఎప్పుడూ కొత్త రేంజ్‌లో క్రియేటివిటీ చూపిస్తారని అందరికీ తెలిసిందే. ఈసారి కూడా ఆయన ప్లాన్‌లో ఏదో వింత మలుపు ఉందనే ఉత్సుకత అందరిలోనూ కనిపిస్తోంది.


ఇక ఈ స్పెషల్ ఈవెంట్‌ లైవ్ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌ జియో హాట్‌స్టార్ సంస్థ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈవెంట్ లో  టైటిల్ గ్లింప్స్ మరియు మహేష్ బాబు ఇంట్రడక్షన్ వీడియోను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. మొత్తానికి, రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ఈ అద్భుత ప్రాజెక్ట్‌ సినిమాపై దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజమౌళి ప్రతి సినిమా ఒక సంబరంలా, ఒక అనుభవంలా మార్చేస్తారని అందరికీ తెలుసు. కాబట్టి ఈసారి ఆయన ఏం ప్లాన్ చేశారో తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇదే కారణంగా, మీడియా మరియు అభిమానులందరూ ఈ ఈవెంట్‌పై కన్నేసి ఉంచారు — ఎందుకంటే జక్కన్న ఎప్పుడూ చేసే పనులు సాధారణం కావు… ప్రతీసారి ఏదో సరికొత్త చరిత్ర సృష్టిస్తాడు!

మరింత సమాచారం తెలుసుకోండి: