- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్‌లో చాలా రోజుల త‌ర్వాత సాలిడ్ మౌత్ టాక్‌తో దూసుకు పోతోన్న సినిమా చిన్న సినిమా ది గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో. తిరువీర్ హీరోగా , రాహుల్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ .. ఇప్పుడు ఇండియాలోనే కాదు, ఓవర్సీస్‌లోనూ అంచ‌నాల‌కు మించి దూసుకు పోతోంది. నార్త్ అమెరికాలో సాలిడ్ రన్ కంటిన్యూ చేస్తోంది. సినిమా ఇప్పటికే 83,777 డాలర్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఇంకా స్ట్రాంగ్‌గా దూసుకు పోతోంది. పెద్ద పెద్ద స్టార్ల సినిమాలు కూడా ఒక్కోసారి కంటిన్యూగా నిల‌బ‌డ‌లేవు. కానీ యూఎస్ మార్కెట్‌లో ఇంత చిన్న సినిమా ఇంకా స్ట్రాంగ్ హోల్డ్ చూపిస్తుండ‌డం విశేషం.


ఈ సినిమాకు అక్క‌డ ఆడియెన్స్ నుంచి వ‌స్తోన్న రెస్పాన్స్ మామూలుగా లేదు. టాలీవుడ్‌లో చాలా రోజుల త‌ర్వాత వ‌చ్చిన క్లీన్ కామెడీ ఎంట‌ర్టైన‌ర్ అంటున్నారు. పెళ్లిచూపులు టైప్ వైబ్, శ్రీకాకుళం యాసలో పండిన సహజమైన కామెడీ, బూతులు లేని క‌థ‌నం .. ఇవ‌న్నీ ఓవ‌ర్సీస్ ప్రేక్ష‌కుల‌కు చాలా బాగా క‌నెక్ట్ అయ్యాయి. ఆడియెన్స్ నుంచి వ‌స్తోన్న ఈ సాలిడ్ రెస్పాన్స్, స్ట‌డీ క‌లెక్ష‌న్ల‌తో ఓవ‌ర్సీస్ డిస్ట్రిబ్యూట‌ర్లు అయిన అధ‌ర్వ‌ణ భ‌ద్ర‌కాళి పిక్చ‌ర్స్ ఇప్పుడు షోల‌ను, లొకేష‌న్ల‌ను షో షోకు పెంచుతోంది.


ఇప్ప‌టికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ను దాటేసి , పాజిటివ్ టాక్‌తో థియేటర్లను పెంచుకుంటూ వెళుతోంది. ఇప్పుడు ఓవ‌ర్సీస్ లోనూ అదే ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. ఇదే దూకుడు చూస్తుంటే ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఇప్పుడు ఈయ‌ర్ స‌ర్ ప్రైజ్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సినిమాగా నిల‌వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. తిరువీర్ నటన, డైరెక్టర్ రాహుల్ శ్రీనివాస్ టేకింగ్.. ఆడియన్స్‌కు ఫుల్ మీల్స్ లాంటి నవ్వులను పంచుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: