- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

మహేష్‌బాబు - రాజ‌మౌళి కాంబినేష‌న్లో తెర‌కెక్ఉతోన్న వారణాసి గ్లింప్స్ , టైటిల్ లాంచ్ ఈవెంట్ భారీ హైప్‌తో ప్రారంభమైనా.. నిర్వహణలో చోటుచేసుకున్న కొన్ని పొరపాట్లు అభిమానులకు అసంతృప్తి కలిగించాయి. కోట్ల రూపాయలు వెచ్చించి గ్రాండ్‌గా ప్లాన్ చేసిన ఈ ఈవెంట్‌లో టెక్నికల్ ఇష్యూలు, స్క్రిప్ట్ అసమర్ధత, యాంకరింగ్ లోపాలు స్పష్టంగా కనిపించాయి. ముఖ్యంగా ఈవెంట్‌కు కీలకమైన వంద అడుగుల ఎల్ఈడి స్క్రీన్ కాసేపు పనిచేయక, దాదాపు పది నిమిషాలపాటు మొరాయించిన సందర్భం వేదికపై ఉన్నవారిని ఇబ్బంది పెట్టింది. ఈ కారణంగా అక్కడ ఉన్న పలువురి రియాక్షన్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈవెంట్‌ను టేస్ట్‌ఫుల్‌గా నడిపించడానికి ముందు నుంచే యాంకర్లకు ప్రత్యేకంగా వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేసినా .. ఆ ప్లానింగ్ ఫలితం పెద్దగా కనిపించలేదు.


ముంబై నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఆశిష్ చంచలాని ఆడియన్స్‌తో కనెక్ట్ కావడంలో కష్టపడటం, హిందీ–ఇంగ్లీష్‌తో మేనేజ్ చేయాలని ప్రయత్నించినా స్టేజ్ ఎనర్జీ కాస్త ఫ్లాట్‌గా ఉండటం గమనార్హం. చివరకు సుమ టేకోవర్ చేసినప్పటికీ, స్క్రిప్ట్ ఓల్డ్ స్టైల్‌లో సాగడంతో కొత్తదనాన్ని ఆశించిన ప్రేక్షకులు నిరాశ చెందారు. మహేష్ బాబును డమ్మీ నందిపై కూర్చోబెట్టి స్టేజ్‌పైకి తీసుకురావడం కూడా ప్రేక్షకుల్లో పెద్దగా ఎగ్జైట్‌మెంట్ రేకెత్తించలేదు.
అంతేకాక, ఈవెంట్‌ను చూస్తున్న వీక్షకులకు ఓటిటి లైవ్‌లో నిరంతర యాడ్స్ చిరాకు తెప్పించాయి. స్టేజ్‌పై కూడా స్పాన్సర్‌ల ప్రెజెంటేషన్లు ఎక్కువయ్యాయని చాలామంది సోషల్ మీడియాలో అభిప్రాయపడ్డారు.


మరింతగా, ఈవెంట్‌కు ముందు రాత్రి డ్రోన్‌కు సంబంధించిన జరిగిన చిన్న సంఘటన కూడా భద్రతాపరమైన ప్రశ్నలను లేవనెత్తింది. మొత్తానికి, భారీ అంచనాలతో జరిగిన ఈవెంట్ బ్లాక్‌బస్టర్‌గా గుర్తింపు పొందాల్సిన చోట, కొన్ని టెక్నికల్ మరియు క్రియేటివ్ లోపాల వల్ల “ జస్ట్ హిట్ ” స్థాయిలోనే ఆగిపోయిందని అభిమానులు భావిస్తున్నారు. అయినప్పటికీ, ఇలాంటి సందర్భాలు భవిష్యత్తు ఈవెంట్లలో మరింత జాగ్రత్తలు తీసుకునేలా రాజ‌మౌళి టీమ్‌కు హెచ్చరికల్లా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: