ఈ కామెంట్స్ ఎందుకు వచ్చాయి అంటే— ఈవెంట్ సమయంలో ఎల్ ఈ డీ స్క్రీన్ మీద వారణాసి గ్లింప్స్ వీడియో సరిగా ప్లే కాకపోవడం. టెక్నికల్ లోపం వచ్చినా, తన సొంత టీమ్‌ను ప్రశ్నించడం బదులుగా దేవుడిపై వ్యాఖ్యలు చేయడం ఏమిటని నెటిజెన్స్ మండిపడుతున్నారు.“గ్లింప్స్ సరిగా ప్లే కాకపోతే టెక్నికల్ టీమ్‌ని ప్రశ్నించాలి. దేవుడిని నిందించడం ఏ లాజిక్? దేవుడి మీద కథ తీస్తూ, అదే దేవుడిని నిందించడం ఎంతవరకు సమంజసం?” అంటూ సోషల్ మీడియాలో విమర్శల వాన కురుస్తోంది.
అదే కాదు, రాజమౌళి గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా మళ్లీ వైరల్ అవుతున్నాయి. ఒక అభిమాని శ్రీ రామనవమి సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ రాజమౌళిని ట్యాగ్ చేశాడు. దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఇలా— “థాంక్యూ… కానీ నాకు శ్రీరాముడు అంటే అసలు ఇష్టం లేదు. నారాయణ అవతారాల్లో నాకు శ్రీకృష్ణుడు అంటేనే ఇష్టం.”అభిమాని శుభాకాంక్షలు చెప్తే “ధన్యవాదాలు, మీకూ శుభాకాంక్షలు” అంటే సరిపోతుంది. కానీ ‘రాముడు నాకిష్టం లేదు’ అని చెప్పడం ఎందుకు? దేవుడిపై ద్వేషం లేకపోతే ఇలాంటి మాటలు వస్తాయా? అంటూ నెటిజెన్స్ రగిలిపోతున్నారు.
“ఇది చిన్న విషయం కాదు. ఇది సెంటిమెంట్. దేవుళ్లపై ఇలాంటి పలుకులు రేపే రోజుల్లో పెద్ద సమస్యలను తెచ్చిపెట్టవచ్చు” అంటూ వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి.మొత్తానికి—వారణాసి సినిమా ఈవెంట్‌తో మొదలైన వివాదం, రాజమౌళి పాత ట్వీట్లు కూడా బయటకు రావడంతో, దర్శకధీరుడు సోషల్ మీడియాలో భారీ విమర్శలను ఎదుర్కొంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి