ఇండియన్ సినీ హిస్టరీలో కల్ట్ క్లాసిక్ మూవీగా 2023లో వచ్చిన కల్కి 2898 AD మూవీ నిలిచిన సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా 1000 కోట్ల గ్రాస్ సాధించి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకోవడమే కాకుండా దర్శకుడు నాగ్ అశ్విన్ ని ఎంతోమంది మెచ్చుకున్నారు. అలా ఈ సినిమాలో టెక్నాలజీని వాడి డైరెక్టర్ ఎంతో అద్భుతంగా సినిమాను తెరకెక్కించారు. అలా ఈ సినిమాలో స్టార్ హీరోలు సైతం భాగమయ్యారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లతోపాటు సీనియర్ నటి శోభన, దీపికా పదుకొనే, దిశా పటాని, ఫరీయా అబ్దుల్లా, మృణాల్ ఠాకూర్ లు కూడా కీ రోల్స్ పోషించారు. అలాగే రాజమౌళి, ఆర్జీవి, అనుదీప్ కె.వి వంటి డైరెక్టర్లు కూడా ఇందులో భాగమయ్యారు.

 అయితే రీసెంట్ గా కల్కి పార్ట్ 2 నుండి దీపికా పదుకొనేని హీరోయిన్ గా తీసివేస్తున్నట్టు చిత్ర యూనిట్ అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇందులో హీరోయిన్ గా ఎవరిని తీసుకోబోతున్నారు అనే టాక్ వినిపిస్తోంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ సినిమాలో ఓ కీ రోల్ కోసం రజినీకాంత్ ని తీసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి  అయితే కల్కి పార్ట్ 2 లో ఓ 30 నిమిషాల పాటు కురుక్షేత్ర యుద్ధం చూపించబోతున్నారని తెలుస్తోంది.అయితే ఇందులో భీష్మ పితామహుడి పాత్రలో రజినీకాంత్ ని తీసుకోబోతున్నట్టు సినీ వర్గాల్లో ఓ టాక్ వినిపిస్తోంది.

 ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం సినిమాపై మరింత హైప్ ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోలు అందరూ సినిమాలో భాగమయ్యారు. ఇక రజినీకాంత్ కూడా చేరితే ఇక సినిమా ఊహించని లెవల్ లో ఉంటుందని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. మరి చూడాలి నిజంగానే రజినీకాంత్ కల్కి పార్ట్ 2 లో కనిపించబోతున్నారా..లేదా ఇది సోషల్ మీడియాలో వినిపిస్తున్న రూమరా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: