గతంలో 'ఛత్రపతి' సినిమాలో గోపీచంద్ విలన్ పాత్రలో నటించి ఉంటే, ఆ సినిమా స్థాయి మరోలా ఉండేదని రాజమౌళి స్వయంగా చెప్పారు. అదేవిధంగా, 'కుంభ' లాంటి క్రూరమైన, బలమైన పాత్రకు గోపీచంద్ మాస్ పవర్ పర్ఫెక్ట్‌గా సరిపోతుందని జక్కన్న భావించారట. కానీ... ప్రాజెక్ట్ మొదలవడం ఆలస్యం కావడం, గోపీచంద్ ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వంటి కారణాల వల్ల, ఈ క్రేజీ కాంబో మళ్లీ కుదరలేదని తెలుస్తోంది. తెలుగు మాచో స్టార్‌ను పవర్ ఫుల్ విలన్ పాత్రలో చూడాలనుకున్న అభిమానులకు ఇది నిజంగా మిస్ అయిన అద్భుతమైన అవకాశం! పృథ్వీరాజ్ ఎంట్రీ: అసలు కథ మారింది! .. గోపీచంద్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో, రాజమౌళి ప్రపంచ స్థాయి నటుడి కోసం వెతకడం మొదలుపెట్టారు. అప్పుడే మలయాళీ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ పేరు తెరపైకి వచ్చింది.
పృథ్వీరాజ్ నటనా ప్రతిభ, ఇంటెన్సిటీని చూసిన రాజమౌళి... ఈ పాత్రకు పెర్ఫార్మెన్స్ ముఖ్యం అని భావించి ఆయనను ఎంచుకున్నారు. "నేను చూసిన అత్యుత్తమ నటులలో పృథ్వీరాజ్ ఒకరు. ఈ క్రూరమైన కుంభ పాత్రకు అతను జీవం పోశాడు" అంటూ రాజమౌళి స్వయంగా పృథ్వీరాజ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం పృథ్వీరాజ్ లుక్ చూశాక, రాజమౌళి నిర్ణయం సరైందే అనిపిస్తోంది. అయితే, గోపీచంద్ లాంటి మాస్ బాడీ లాంగ్వేజ్ ఉన్న హీరో... 'కుంభ' పాత్రను పోషించి ఉంటే ఆ వైల్డ్ పవర్ ఎలా ఉండేదో అని అభిమానులు ఇప్పుడు చర్చించుకుంటున్నారు! గోపీచంద్ చేయాల్సిన పాత్రను పృథ్వీరాజ్ ఏ రేంజ్‌లో ప్రెజెంట్ చేస్తాడో చూడాలంటే, సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి