సినిమా కాన్సెప్ట్‌ను సూచించేలా, చిన్న చిన్న క్లూలతో కూడిన గ్లింప్స్ వీడియో రూపంలో ఒక గ్లింప్స్ విడుదల చేసింది. ఆ గ్లింప్స్‌లో చూపించిన విజువల్స్, రాజమౌళి విజన్‌కి తగ్గట్టే కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయడం మాత్రమే కాకుండా, అభిమానుల్లో అద్భుతమైన ఉత్సాహాన్ని రేపాయి. గ్లింప్స్ రిలీజ్ అయిన క్షణం నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్‌ఛార్ట్స్ పేలిపోయాయి. రాజమౌళి స్టైల్ ఆఫ్ మేకింగ్, మహేష్ బాబు లుక్ — రెండూ కలిసి జనాల్ని క్లిక్ అయ్యేలా చేశాయి. విడుదలైన వెంటనే ఆ గ్లింప్స్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతూ, అప్‌లోడ్ చేసిన ప్లాట్‌ఫారమ్‌లోనే ఆల్ టైమ్ రికార్డులు సాధించింది. అంతే కాదు, గ్లింప్స్ విడుదల ముందు నుంచే ఈ సినిమా క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థమయ్యే విధంగా, అనౌన్స్‌మెంట్ పోస్టర్ వెయ్యక ముందే కూడా ప్రీ-బజ్ లెవెల్ ఆకాశాన్నంటింది.
ఇవన్నీ పక్కన పెడితే—సినిమా రిలీజ్ కాకముందే ఇంతటి సెన్సేషనల్ రికార్డులు క్రియేట్ చేయడం నిజంగా ఇండస్ట్రీలో మైలురాయిగా మారింది. నో డౌట్… సినిమా థియేటర్లకు వచ్చాక అయితే, ఈ రికార్డులు అన్నీ మొదటి రోజే దుమ్ము దులిపే అవకాశం ఉంది. రాజమౌళి – మహేష్ కాంబినేషన్ అంటే ఎక్స్‌పెక్టేషన్స్‌కి కూడా పరిమితులు ఉండవు. ఇంతలో సోషల్ మీడియాలో మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. “వారణాసి సినిమా క్రియేట్ చేస్తున్న రికార్డులను బద్దలు కొట్టాలంటే… అలాంటి పవర్ ఉన్న స్టార్ హీరో సినిమా మాత్రమే అడుగుపెట్టాలి” అని అభిమానులు చర్చిస్తున్నారు.
సాధారణంగా రాజమౌళి రికార్డ్స్‌ని బద్దలు కొట్టేది రాజమౌళి సినిమానే అన్న మాట గతంలో చాలాసార్లు విన్నాం. కానీ ఈసారి మాత్రం విషయం తేడా. జనాలు రెండు పేర్లు బలంగా చర్చిస్తున్నారు..అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా.. ప్రభాస్ “స్పిరిట్” సినిమా. ఫ్యాన్స్ అభిప్రాయం ప్రకారం, ‘వారణాసి’ క్రేజ్‌ని, ఆ మూవీ ప్రీ-రికార్డ్స్‌ని బీట్ చేయాలంటే ఈ ఇద్దరి స్టార్ పవర్ మాత్రమే సరిపోతుంది అంటున్నారు. కొంతమంది అయితే — “అల్లు అర్జున్ పాన్ ఇండియా మార్కెట్‌లో చూపిస్తున్న రేంజ్, అభిమానుల మాస్ క్రేజ్ — ఇవి వారణాసి రికార్డ్స్‌కి పెద్ద టఫ్ ఇస్తాయి” అంటుండగా, మరికొందరు — “ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా అయితే ప్రపంచవ్యాప్తంగా యాక్షన్ మార్కెట్‌ను ఊపేస్తుంది. ఆ రేంజ్ హైప్‌తోనే వారణాసి రికార్డ్స్‌ను టచ్ చేసే ఛాన్స్ ఉంది” అంటున్నారు.
ఇలా సోషల్ మీడియా మొత్తం వారణాసి వ్స్ అల్లు అర్జున్/ప్రభాస్ చర్చతో నిండిపోయింది. ఎవరి సినిమా ముందొస్తుందో, ఎవరు ఎలాంటి ప్రీ-రికార్డ్స్‌తో ఎంట్రీ ఇస్తారో తెలియదు కానీ —వారణాసి భారీ రికార్డు పుస్తకం మొత్తం కొత్తగా రాసే సినిమా అవడం ఖాయం!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి