ఇటీవలి కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రమోషన్ పద్ధతులు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు సినిమా టైటిల్ ప్రకటించినా సరే, ఒక చిన్న ఈవెంట్‌తో ఊరుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. టైటిల్ అనౌన్స్ చేయడానికే ఒక భారీ ఈవెంట్, టీజర్ రిలీజ్‌కి మరో స్టేజ్ షో, మొదటి పాట విడుదలకు వేరు ఈవెంట్, ఇలా సినిమా రిలీజ్ అయ్యేలోపు కోట్లు ఖర్చు పెట్టడం చాలా సాధారణంగా మారిపోయింది. పెద్ద పెద్ద ఫంక్షన్స్, గ్లిట్టరీ స్టేజ్‌లు, లైవ్ షోలు, ప్రముఖులను తీసుకొచ్చి ప్రచారం చేయించడం – ఇవన్నీ చాలామంది సినిమాలకు తప్పనిసరి స్ట్రాటజీగా మారిన విషయమే.


అంతటి హైప్, అంతటి వెలుగు వెన్నెల మధ్య వచ్చిన అనేక సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదని మనం చూశాం. ఈవెంట్స్‌పై కోట్లు ఖర్చు పెట్టినా, ప్రమోషన్లలో ఆకాశం తాకినా, థియేటర్లలో మాత్రం ప్రేక్షకులు విపరీతంగా స్పందించని సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ఈ మొత్తం ట్రెండ్‌ను ఒక్క సినిమా పూర్తిగా మార్చేసింది "ఆంధ్రా కింగ్ తాలుకా". ఈవెంట్‌లకోసం కోట్లు ఖర్చు పెట్టకుండానే, కేవలం తన సింపుల్ ప్రమోషన్‌తోనే అన్ని సినిమాలను “షట్ అప్!” అనిపించేలా హిట్ సాధించింది — అదే ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ఈ చిత్రం తాజాగా విడుదలై, పూర్తిగా సూపర్ డూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. చాలా కాలం తర్వాత రామ్ పోతినేని కి వచ్చిన మంచి హిట్ ఇదేనని అభిమానులు ఆనందపడుతున్నారు. ఈ సినిమాలో రామ్ గెట్‌అప్, నటన, ఎనర్జీ, లుక్ – అన్నీ అద్భుతంగా పండించడంతో ప్రేక్షకులు కూడా ఆయనను మరోసారి మాస్ హీరోగా అంగీకరించారు. గతంలో వరుసగా ఫ్లాప్స్ వచ్చిన సమయంలో ఈ హిట్ ఆయన కెరీర్‌కు రీఎంట్రీ స్థాయి బూస్ట్ ఇచ్చింది.



ముఖ్యంగా, ఈ సినిమాకి భారీ భారీ ఈవెంట్లు లేవు, కోట్ల ఖర్చులు లేవు, ఆడంబరం లేదు. రామ్ పోతినేని మరియు టీమ్ నిజాయితీగా కథ, కష్టపడి చేసిన పని, సినిమా సారాంశం మాత్రమే జనాలకు తీసుకెళ్లారు. ఇంటర్వ్యూలు, ప్రమోషన్లు, సోషల్ మీడియా ఇంటరాక్షన్స్ – ఇవన్నీ చాలా సింపుల్‌గా, ఆర్టిఫిషియాలిటీ లేకుండా చేశారు. “సినిమా ఎలా వచ్చింది? దాని కోసం ఎలాంటి కష్టపడ్డాం?” వంటి నిజమైన విషయాలనే ప్రజలకు చెప్పడమే వారి లక్ష్యం. సినిమా విడుదలైన వెంటనే ప్రేక్షకులు భారీగా థియేటర్లకు వచ్చి సూపర్ హిట్ టాక్ ఇచ్చారు. ఇలా భారీ ప్రమోషన్ల జోలికి పోకుండానే హిట్ అందుకోవడం ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది.ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఇదే న్యూస్ వైరల్ అవుతోంది.

 

ఫ్యాన్స్, సినిమా ప్రేమికులు ఇలా కామెంట్లు చేస్తున్నారు: “పెద్ద పెద్ద ఈవెంట్లు పెడితేనే సినిమా హిట్ అవుతుంది అనేది తప్పు.” “సినిమా చిన్న బడ్జెట్‌లో చేసినా, కాన్సెప్ట్ బాగుంటే, నిజాయితీగా ప్రమోట్ చేస్తే చాలు – హిట్ అవుతుంది.”,,“ఆంధ్ర కింగ్ తాలూకా దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్.”..ఇలా రామ్ పోతినేని హార్డ్‌వర్క్, సినిమా టీమ్ డెడికేషన్, మరియు ఈవెంట్‌లపై పోటీపడకపోయినా విజయం సాధించిన తీరు – ఇవన్నీ ఇప్పుడు ప్రతి ప్లాట్‌ఫారమ్‌లో చర్చనీయాంశంగా మారిపోయాయి.మొత్తానికి, ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ప్రత్యేక ఈవెంట్లు లేకుండానే బ్లాక్‌బస్టర్ అయ్యి, ఇండస్ట్రీకి ఒక స్పష్టమైన సందేశం ఇచ్చింది..“నిజాయితీగా తీసిన మంచి సినిమా ఎప్పుడూ గెలుస్తుంది.”..!!

మరింత సమాచారం తెలుసుకోండి: