ఇప్పుడు రాజమౌళి చేసిన ఈవెంట్‌ను మిగతా స్టార్ డైరెక్టర్లు కూడా ఫాలో అవుతున్నారని సమాచారం. మరీ ముఖ్యంగా నెక్స్ట్ రాబోతున్న భారీ బడ్జెట్ చిత్రాలు ఇదే స్ట్రాటజీని ముందుకు తీసుకెళ్తున్నారట. అల్లు అర్జున్ సినిమా కోసం కూడా ఇలాంటి ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట. సినిమా టైటిల్ అండ్ గ్లింప్స్ రిలీజ్ చేయడాని భారీ ఈవెంట్ ని జనవరి 10 న ప్లాన్ చేశారట. అలాగే, ప్రశాంత్, నిల్, జూనియర్ ఎన్టీఆర్ లు కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారని టాక్ బయటకు వచ్చింది. కానీ, సినీ ఇండస్ట్రీలో అనేక విశ్లేషకులు దీనిని ఒక పెద్ద మిస్టేక్ గా చూస్తున్నారు. చిన్న ఈవెంట్ రూపంలో సినిమా ప్రమోషన్ చేయడం మంచిది అని, ఈ విధంగా విపరీతంగా ఖర్చు పెట్టడం మిగతా స్టార్ డైరెక్టర్లు ఫాలో అవ్వడం మరింత పెద్ద సమస్యగా మారే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.
ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఈవెంట్ చేయడం వల్ల, టికెట్ రేట్లు పెరుగుతాయి, సాధారణ ప్రేక్షకులకు సినిమాలు చూడటంలో ఇబ్బంది కలుగుతుంది. ప్రజలు భయపడే స్థాయిలో ధరలు పెరుగుతున్నాయి. అందుకే, రాజమౌళి చేసిన ఈ “బిగ్ మిస్టేక్” ను ఇతరులు అదే విధంగా కొనసాగించాలనుకోవడం మూర్ఖత్వమే అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు .ఇప్పుడు, సోషల్ మీడియాలో ఈ ఎంటైర్ సీన్ పెద్ద రచ్చ రంబోలాగా మారిపోతుంది, కొంతమంది దీనిని అతి ఎక్కువ హైప్ చేయడం కొనసాగిస్తున్నారు. మరికొంత మంది పెంట పని అని మండిపడుతున్నారు..!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి