- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

బాలీవుడ్‌లో వరుసగా ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల‌తో ఒక్క‌సారిగా సెన్షేష‌న‌ల్ దర్శకుడి గా మారిన‌ సందీప్ రెడ్డి వంగా, ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో తన తదుపరి ప్రాజెక్టుల కోసం కూడా బాలీవుడ్ నటులతోనే ఎక్కువగా పని చేయాలనుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఆయన డైరెక్షన్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘స్పిరిట్’ ప్రస్తుతం ఇండియన్ సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రానికి హీరోయిన్‌గా బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ త్రుప్తి దిమ్రీ ఇప్పటికే అధికారికంగా ఎంపికయ్యారు. ప్రభాస్ - త్రిప్తి దిమ్రి కాంబినేషన్ ఎలా ఉండబోతుందన్న ? ఆసక్తి అభిమానుల్లో పెరిగిపోతోంది.


ఇదిలా ఉండగా, ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం కరీనా కపూర్‌ను తీసుకున్నారని ఇటీవల మీడియాలో వార్తలు గట్టిగా వినిపించాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఆమె ‘స్పిరిట్’లో భాగం కావడం లేదని తెలుస్తోంది. ఆమె స్థానంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్‌ను తీసుకునే దిశగా మేక‌ర్స్‌ ముందుకువెళ్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. కాజోల్‌కి బలమైన స్క్రీన్ ప్రెజెన్స్, ఇంటెన్సిటీ ఉన్న పాత్రలు అద్భుతంగా నప్పుతాయనే విషయం తెలిసిందే. అందువల్ల సాంప్రదాయ హీరోయిన్ల రేంజ్‌లో కాకుండా, కథలో ప్రధాన మలుపు తిప్పే పవర్‌ఫుల్ రోల్ కోసం ఆమెను ఎంపిక చేసినట్లు అనిపిస్తోంది. అయితే ఆమె పాత్ర నెగటివ్ షేడ్స్‌లోనా? లేదా ఎమోష‌న‌ల్‌గా ఉంటుందా ? అనే అంశంపై స్పష్టత కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.


ఇప్పటికే ‘స్పిరిట్’ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. భారీ యాక్షన్ సీక్వెన్సులు, కీలక డ్రామాటిక్ సన్నివేశాలతో మొదటి షెడ్యూల్ కొనసాగుతోందని సమాచారం. ప్రభాస్ కెరీర్‌లోనే అత్యంత తీవ్రత, మాస్, యాక్ష‌న్ తో కూడిన పాత్రను సందీప్ రెడ్డి వంగా రూపొందిస్తున్నారని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగా గడచిన రెండు సినిమాల్లానే రక్తికట్టే డైరెక్టింగ్ స్టైల్, భావోద్వేగాల పేలుడు, ప్రతీకార యాక్షన్‌ను ఈ సినిమాలో కూడా మరింత ఎత్తుకు తీసుకెళ్లబోతున్నారని తెలుస్తోంది. ఏదేమైనా కాజ‌ల్ ఎంట్రీతో సినిమాపై హైప్ అయితే మామూలుగా లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: