'ఫీనిక్స్'తో ఫుల్ ఫామ్..
వర్షా విశ్వనాథ్ తన సినీ కెరీర్‌ను 2022లో 'రెడ్డిగారింట్లో రౌడీయిజం' అనే తెలుగు సినిమాతో మొదలుపెట్టింది. అయితే ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. అయినా నిరాశ చెందకుండా, ఆమె మలయాళంలో 'పాథోన్పథం నూట్టండు' అనే చిత్రంలో నటించింది. ఆ మూవీ సూపర్ హిట్ కావడంతో వర్షకు మంచి బ్రేక్ వచ్చింది.తాజాగా, ఈ యంగ్ బ్యూటీ.. స్టార్ హీరో విజయ్ సేతుపతి తనయుడు సూర్య సేతుపతి హీరోగా నటించిన 'ఫీనిక్స్' (Phoenix) సినిమాలో కీలక పాత్ర పోషించి, తన అద్భుతమైన అందంతో ఆడియన్స్‌ను కట్టిపడేసింది. ఈ సినిమా సక్సెస్‌తో ఇప్పుడు వర్షా విశ్వనాథ్ పేరు సౌత్ ఇండస్ట్రీలో మారుమోగుతోంది.
స్టార్ వారసత్వం.. ఫుల్ గ్లామర్ పవర్!
సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకుని, రాజకీయాల్లోనూ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్న వాణీ విశ్వనాథ్.. ఇప్పుడు తన మేనకోడలి రూపంలో మళ్లీ సినీ రంగంలో ఫుల్ ఫామ్‌లోకి వచ్చింది. తన అత్త వాణీ విశ్వనాథ్ మాదిరిగానే, వర్ష కూడా తన అభినయంతో పాటు ఆకట్టుకునే అందంతో తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరవుతోంది. ఆమె ఫొటోలు, సోషల్ మీడియా పోస్టులు నిత్యం వైరల్ అవుతూ.. కుర్రాళ్లకు మతి పోగొడుతున్నాయి. వాణీ విశ్వనాథ్ లెగసీని ఈ అందాల తార వర్షా విశ్వనాథ్ కోలీవుడ్, టాలీవుడ్‌లో ఎంతవరకు ముందుకు తీసుకెళ్తుందో చూడాలి!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి