ఈ రోజుల్లో ఓ సినిమా ప్రేక్షకుల్లోకి చేరాలంటే సాధారణ ప్రమోషన్లు సరిపోవడం లేదు. కొత్త కోణాలు, ప్రజల దైనందిన జీవితంలోకి సినిమాను తీసుకెళ్లే ప్రయత్నాలు తప్పనిసరి అయ్యాయి. అదే దారిలో ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అన్ని పరిశ్రమలు ప్రయోగాలు చేస్తుండగా, తాజాగా బాలీవుడ్‌లో కనిపించిన ఒక ప్రమోషన్ టెక్నిక్ ఇప్పుడు తెలుగులో కూడా హాట్ టాపిక్‌గా మారింది. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమా కోసం మేకర్స్ అమెజాన్‌తో ప్రత్యేక టైఅప్ చేయడం సినీ వర్గాల్లో అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది. డెలివరీ పార్శిల్స్‌పై కూలీ పోస్టర్లను ప్రింట్ చేసి, సినిమా రిలీజ్‌కు ముందుగానే ప్రజల చేతికి చేరేలా ఆ పార్శిల్స్‌ను పంపిణీ చేశారు. ఈ ఐడియా ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో డెలివరీ బాక్సుల ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.


తాజా సమాచారం ప్రకారం, అదే స్ట్రాటజీని ఇప్పుడు నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2: తాండవం’ సినిమా టీమ్ కూడా అమలు చేస్తున్నారని తెలిసింది. ఇప్పటికే అఖండ 2 పోస్టర్లతో ఉన్న డెలివరీ పార్శిల్స్ కొంతమంది చేతికి చేరుతున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. దీంతో అభిమానుల్లో హైప్ మరింత పెరిగింది. ముఖ్యంగా తెలుగులో ఇదే తరహా ప్రమోషన్ మొదటిసారి జరగడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. సినిమా ప్రమోషన్స్‌లో ఒక కొత్త ట్రెండ్‌ను అఖండ 2 టీమ్ సెట్ చేసినట్లుగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.


ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలు భారీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ప్రమోషన్లతో మరింత రెంజ్‌లో దూసుకుపోతోంది. డిసెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ‘అఖండ 2: తాండవం’ కోసం అభిమానులు, ట్రేడ్ వర్గాలు అత్యంత ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. మొదటి భాగం సృష్టించిన సంచలన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: