నిజానికి, మహేశ్వరి, దివంగత అతిలోక సుందరి శ్రీదేవికి దగ్గరి బంధువు. వారు ఇద్దరూ కజిన్ సిస్టర్స్ (అక్కా చెల్లెళ్లు) అవుతారు. కాబట్టి, శ్రీదేవి కూతురైన జాన్వీ కపూర్.. మహేశ్వరికి మేనకోడలు అవుతుంది. ఈ కారణంగానే జాన్వీ కపూర్, మహేశ్వరిని ఆంటీ (పిన్ని) అని పిలుస్తుంది. వయసులో పెద్ద తేడా లేకపోవడంతో వీరిద్దరూ చాలా క్లోజ్‌గా, స్నేహితుల్లా ఉంటారు.శ్రీదేవి మరణం తర్వాత జాన్వీ కపూర్ సినీ కెరీర్‌లో, వ్యక్తిగత జీవితంలో మహేశ్వరి చాలా అండగా నిలిచింది. తరచుగా జాన్వీ కపూర్ తన పిన్ని మహేశ్వరితో కలిసి ఆలయాలను, ముఖ్యంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం మనం చూస్తుంటాం. ఇటీవల తన సినిమాల ప్రమోషన్స్ కోసం కూడా మహేశ్వరి అండగా నిలిచింది.
ఒకప్పుడు తెలుగు తెరను ఏలిన మహేశ్వరి ఫ్యామిలీ నుంచి.. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో స్టార్‌డమ్ తెచ్చుకుంటున్న జాన్వీ కపూర్ టాలీవుడ్‌లో దూసుకుపోవడం విశేషం! ఎన్టీఆర్ తర్వాత రామ్ చరణ్ సరసన 'పెద్ది' చిత్రంలో నటిస్తూ జాన్వీ కపూర్ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ఏదేమైనా.. అలనాటి అందాల రాణి, నేటి గ్లామర్ బ్యూటీ మధ్య ఉన్న ఈ బంధం మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి