కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లయితే మన తెలుగు స్టార్ హీరోలు నటించిన సినిమాలు కూడా తెలుగులో మినహాయిస్తే వేరే భాషల్లో పెద్దగా విడుదల అయ్యేవి కావు. కానీ ప్రస్తుతం పరిస్థితులు చాలా వరకు మారాయి. టాలీవుడ్ స్టార్ హీరోలు నటించిన సినిమాలు దాదాపు చాలా భాషల్లో విడుదలవుతున్నాయి. ఇక ఈ మధ్య కాలంలో మీడియం మరియు చిన్న స్థాయి హీరోల సినిమాలు కూడా అనేక భాషల్లో విడుదల అవుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో ఒకరు అయినటువంటి ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం తక్షకుడు అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను థియేటర్లలో కాకుండా ఓ టీ టీ లో విడుదల చేయనున్నారు. తాజాగా ఈయన ఓ సినిమా ఈవెంట్లో పాల్గొన్నాడు. ఆ సినిమా ఈవెంట్ లో భాగంగా ఎందుకు ఆనంద దేవరకొండ మీ బ్యానర్ లో నటిస్తున్న తక్షకుడు మూవీ ని థియేటర్లలో కాకుండా ఓ టీ టీ లో విడుదల చేయబోతున్నారు అనే ప్రశ్న నాగ వంశీ కి ఎదురయింది. 

దానికి నాగ వంశీ సమాధానం చెబుతూ ... కొన్ని సినిమాలను థియేటర్లలో విడుదల చేయాలి. మరికొన్ని సినిమాలు ఓ టీ టీ లో విడుదల అయితే బాగుంటుంది. ఆనంద్ దేవరకొండ మా బ్యానర్లో ప్రస్తుతం నటిస్తున్న తక్షకుడు సినిమాను మేము 30 భాషలలో అనేక దేశాలలో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు వీక్షించే విధంగా రూపొందిస్తున్నాం. అందుకే ఆ సినిమాను థియేటర్లలో కాకుండా ఓ టీ టీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం అని చెప్పుకొచ్చాడు. దీనితో ఈ సినిమా 30 భాషల్లో విడుదల కానుంది అని నాగ వంశీ చెప్పడంతో ఈ మూవీ కి మంచి రెస్పాన్స్ జనాల నుండి వచ్చినట్లయితే ఈ మూవీ ద్వారా ఆనంద్ దేవరకొండ కు మంచి క్రేజ్ వస్తుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ad