టాలీవుడ్ లో మిల్కీ బ్యూటీగా పేరు సంపాదించింది హీరోయిన్ తమన్నా. 2005లో శ్రీ అనే సినిమా ద్వారా తన కెరియర్ ను మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. తమిళ్, హిందీ వంటి భాషలలో కూడా నటించి క్రేజీ సంపాదించుకుంది తమన్నా. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా తమన్నా బాలీవుడ్ చిత్రాలు వైపే ఫోకస్ చేసినట్లుగా కనిపిస్తోంది. మరి ముఖ్యంగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో బ్రేకప్ తర్వాత పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది.



అటు కెరియర్ పరంగా తన ఫిట్నెస్ విషయంలో కూడా పూర్తిగా మారిపోయింది తమన్నా. బరువు తగ్గి మరి గ్లామర్ బ్యూటీగా మళ్లీ కెరియర్ పైన ఫోకస్ చేసినట్లుగా కనిపిస్తోంది. నయనతార, సంయుక్త మీనన్ వంటి వారే కాకుండా ఇతర హీరోయిన్స్ తమ సినిమాల లైనప్ తో అదరగొట్టేస్తున్నారు. ఇప్పుడు వారందరిని మించిపోయింది తమన్నా. ఒకవైపు స్పెషల్ సాంగ్ లలో కనిపిస్తూ మరొకవైపు హీరోయిన్ గా కూడా అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం బాలీవుడ్లో బడా ప్రాజెక్టులలో నటిస్తోంది.



షాహిద్ కపూర్ తో ఓ రోమియో, అలాగే సంజయ్ దత్, అజయ్ దేవగన్ తో రేంజర్, రోహిత్ శెట్టితో ఒక సినిమా, అలాగే సిద్ధార్థ మల్హోత్రా తో వివాన్ చిత్రంలో, రాగిణి MMS 3  వంటి చిత్రాలలో నటించడమే కాకుండా అలాగే లెజెండ్రి బయోపిక్ ఫిలిం మేకర్ శాంతారాం బయోపిక్ లో కూడా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇటీవలే తమన్నా సైన్ చేసినట్లు సమాచారం. దీన్నిబట్టి చూస్తూ ఉంటే తమన్నా రాబోయే రోజుల్లో తెలుగు సినిమాలకు దూరమయ్యేలా కనిపిస్తోందని అభిమానులు భావిస్తున్నారు. ఈ ఏడాది ఓదెల 2 సినిమాతో పరవాలేదు అనిపించుకున్న తమన్నా ఆ తర్వాత బాలీవుడ్లో రైడ్ 2 చిత్రంలో స్పెషల్ సాంగ్ తో అలరించింది. 2026 లో ఏకంగా నాలుగైదు సినిమాలతో అలరించబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: