2005లో వచ్చిన ‘అతడు’ సినిమాలో ఒక ఐకానిక్ యాక్షన్ సీన్ ఉంది. అదే.. కాంట్రాక్ట్ కిల్లర్ అయిన నందు (మహేష్ బాబు) పోలీసులు సరౌండ్ చేయగా, తప్పించుకునే క్రమంలో బిల్డింగ్ పై నుంచి తాడు పట్టుకుని పక్కనే వెళ్తున్న రైలు పైకి దూకే సీన్! అప్పట్లో ఈ సీన్ గురించి, గురూజీ క్రియేటివిటీ గురించి సినీ ప్రేమికులు కథలు కథలుగా చెప్పుకున్నారు. అది త్రివిక్రమ్ సృజనాత్మకతకు పరాకాష్ట అని భావించారు.కానీ, ఇప్పుడు నెటిజన్లు దానికి అసలు ఆధారాన్ని బయటపెట్టారు. ఆ సీన్ త్రివిక్రమ్ క్రియేటివిటీ కాదని, 1998లో వచ్చిన హాలీవుడ్ చిత్రం ‘యూఎస్ మార్షల్స్’ (US Marshals) సినిమా నుంచి యథాతథంగా కాపీ కొట్టింది అని ఆధారాలతో సహా నిరూపించారు! 2005లో ‘అతడు’ రావడం వలన, అంతకు ఏడేళ్ల క్రితం వచ్చిన హాలీవుడ్ సినిమాను ఎవరూ గుర్తుపట్టరులే అని త్రివిక్రమ్ భావించి ఉంటారని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
అతడు మాత్రమే కాదు.. ‘అజ్ఞాతవాసి’, ‘అల వైకుంఠపురంలో’, ‘జులాయి’ వంటి గురూజీ సినిమాల్లో కూడా హాలీవుడ్ రిఫరెన్స్‌లు ఉన్నాయని నెటిజన్లు ఆధారాలు బయటపెడుతున్నారు. ‘కథలకు పోలిన కథలు ఉంటాయేమో గానీ, సీన్‌లను ఒకేలా తీయడం కేవలం కాపీ కొట్టినప్పుడు మాత్రమే సాధ్యం’ అని ట్రేడ్ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి.దీంతో, గురూజీ గురూజీ అని పొగిడిన మహేష్ బాబు మాస్ అభిమానులు సైతం, "ఓర్నీ.. నీ క్రియేటివిటీని పొగుడుతుంటే.. కాపీ చేసి గుండెల్లో పొడిచావ్ కదా బాసూ!" అంటూ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు! ఈ కాపీ వివాదం టాలీవుడ్‌లో కొత్త మాస్ డిబేట్‌ను లేవనెత్తింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి