ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న సమాచారం ప్రకారం 'కల్కీ 2'లో నటించబోయే బ్యూటీ పేరు ఒకటి బలంగా వినిపిస్తోంది. ఈ బ్యూటీ ఎవరో కాదు .. గ్లోబల్ ఐకాన్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కావడం విశేషం. ప్రస్తుతం కల్కి ఫ్రాంచైజీ ని పాన్ ఇండియా స్థాయి నుంచి నేరుగా ఇంటర్నేషనల్ లెవల్ కు తీసుకు వెళ్లే ఆలోచనలో ఉందంటున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ కు జోడీగా ప్రియాంక చోప్రా హీరోయిన్ గా ఉంటే కల్కి సీక్వెల్ హాలీవుడ్, యూరప్, ఆసియా మార్కెట్లలోనూ భారీ ఓపెనింగ్స్, బజ్ వచ్చే అవకాశం ఉందని టీమ్ టీమ్ భావిస్తుందట.
మొదటి పార్ట్‌లో దీపిక రోల్ నే కథకు అత్యంత కీలకం. ఆమె గర్భిణీగా కనిపించిన సన్నివేశాలు, ఎమోషనల్ సీన్లు ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేశాయి. అందుకే సీక్వెల్ దీపికా పదుకోణే లేకపోవడంతో చాలా మందికి షాక్ ఇచ్చినట్లయ్యింది. దీపిక భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో పాటు ఆమె రోజుకు కేవలం 8 గంటలు మాత్రమే పని చేస్తానని కండీషన్లు పెట్టడం .. ఇవన్నీ కల్కి మేకర్స్‌కు ఇబ్బందిగా మారాయట. ఇక ఆమె ఇటీవల ప్రభాస్ స్పిరిట్ సినిమా నుంచి సైతం తప్పుకున్న సంగతి తెలిసిందే. కల్కి లో దీపిక ఔట్ అయిన వెంటనే అనుష్క శెట్టి, సాయి పల్లవి, శ్రుతి హాసన్ వంటి పేర్లు చర్చల్లో నానాయి. ఇప్పుడు ఏకంగా ప్రియాంక చోప్రా పేరు ఫైనల్ అయ్యిందంటున్నారు. ప్రభాస్ - ప్రియాంక జోడీ అంటే వెండి తెర షేక్ అవుతుంది అనడంంలో సందేహం లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి