- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన పాన్ ఇండియా మోస్ట్ అవైటెడ్ సినిమా అఖండ 2 - తాండ‌వం. సెన్షేష‌న‌ల్ సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమా అఖండ‌కు సీక్వెల్ గా వ‌స్తోన్న ఈ అఖండ 2 తాండవం బాల‌య్య కెరీర్ లోనే ఏ సినిమాకు జ‌ర‌గ‌న‌ట్టుగా ఏకంగా రు . 123 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో గట్టి ప్రమోషన్స్ మ‌ధ్య రిలీజ్ అవుతోంది.  .ఇక లేటెస్ట్ గానే ఏపీలో రిలీజ్ కి ముందు రోజు రాత్రి నుంచే పైడ్ ప్రీమియర్స్ ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.


ఈ ఫెయిడ్ ప్రీమియ‌ర్స్ తో పాటు 5వ తేదీ షోల కు ఇలా బుకింగ్స్ ఓపెన్ చేయగా వీటికి సెన్సేషనల్ రెస్పాన్స్ ఇప్పుడు వస్తుంది. దాదాపు అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ ఎక్కడపడితే అక్కడ పడుతున్నాయి. ఏపీలో మాత్రం అఖండ 2 సినిమాకు మామూలు డిమాండ్ లేదు. ఇక ఈ ప్రిమియ‌ర్స్ కు టిక్కెట్ రేట్లు పెంచుకోవ‌డం తో మంచి ఓపెనింగ్స్ పడతాయని ట్రేడ్ వ‌ర్గాలు లెక్క‌లు క‌డుతున్నాయి .. ఈ సినిమా కి థమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్స్ ప్లస్ వారు నిర్మాణం వహించారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రు కు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: