“శ్రీతేజ్‌కు మళ్లీ మింగే శక్తి, మాట్లాడే శక్తి, కదలిక వచ్చేలా రిహాబిలిటేషన్ చాలా ముఖ్యం” అని డాక్టర్లు సూచించడంతో, బాస్కర్ రోజువారీగా థెరపీల కోసం బాబును తీసుకెళ్తున్నారు. సికింద్రాబాద్‌లోని ఆసియా ట్రాన్స్‌కేర్ రిహాబిలిటేషన్ సెంటర్‌లో స్వాలో, స్పీచ్ థెరపీలు జరుగుతున్నాయి.అక్కడ అడ్మిట్ చేస్తే నెలకు రూ.90,000 పైగా ఖర్చవుతుంది.ఇంట్లో ఉండే 7 ఏళ్ల కుమార్తె, 75 ఏళ్ల తల్లి బాధ్యతలు కూడా ఆయనపైనే.అందుకే ప్రతి రోజు దిల్‌షుఖ్‌నగర్ నుంచి సికింద్రాబాద్ వరకు క్యాబ్‌లో బాబును తీసుకెళ్లి, థెరపీ పూర్తి చేసి మళ్లీ ఇంటికి తీసుకువస్తున్నారు.
కేవలం రిహాబిలిటేషన్ ఖర్చులే రోజుకు రూ.2,000, నెలకి రూ.60,000 దాటిపోతున్నాయి.ఇంట్లో ఫిజియోథెరపీకి మరిన్ని రూ.30,000. మొత్తం ప్రతి నెలా తప్పనిసరిగా రూ.90,000 పైగా ఖర్చవుతోంది.డాక్టర్లు “కనీసం 2-3 సంవత్సరాలు నిరంతరం ప్రత్యేక థెరపీలు చేస్తే కొంతవరకు కోలుకునే అవకాశం ఉంది” అని చెప్పారు. ఆ ఆశను పట్టుకుని భాస్కర్ రాత్రింబవళ్లు త్యాగం చేస్తూ పోరాడుతున్నారు. ఒంటరిగా, భారమైన ఖర్చులతో, ఇంత పెద్ద మానసిక వేదనతో, చిన్నారి మీదున్న ప్రేమతో ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.
దుర్ఘటన కేవలం ఒక ప్రమాదం కాదు… ఒక కుటుంబం జీవితం పూర్తిగా మారిపోయిన క్షణం. థియేటర్‌లో ఒక సినిమా చూడటానికి వెళ్లిన కుటుంబం… ఒక సంవత్సరం తరువాత ఇలా గాయాలతో, కన్నీళ్లతో, ఆర్థిక భారాలతో మిగిలిపోవడం ఎంత హృదయ విదారకమో చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నారి శ్రీతేజ్ ఎదుర్కొంటున్న కష్టాలు… ఓ తండ్రి ఒంటరిగా చేస్తున్న పోరాటం… ఆ కుటుంబం అనుభవిస్తున్న బాధలు… ఇవన్నీ మనసును కదిలించేలా ఉంటాయి. చాలా మమది బన్నీ పై మండిపడుతున్నారు. నువ్వు సరదాగా ఫ్యామిలీతో గదిపే ఓ గంట సేపు ఖర్చు చేసే మనీ.. శ్రీతేజ్ కి నెల రోజుల ట్రీట్ మెంట్ ఖర్చు అంటూ మండిపడుతున్నారు..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి