నందమూరి నటసింహం బాలకృష్ణ మరోసారి తన మాస్ ఎనర్జీతో ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు ‘అఖండ 2’తో ఝలక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. డిసెంబర్ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుండడంతో, మూవీ యూనిట్ ప్రమోషన్లలో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ ఇండియాలో కూడా భారీ ఆసక్తి నెలకొనడంతో బాలకృష్ణ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఇలాంటి ప్రమోషన్లలో భాగంగా, నార్త్ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో యాంకర్ బాలయ్యకు ఓ ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. “ముంబై అయినా, గోవా అయినా… ఇప్పుడు ఎక్కడికెళ్లినా ‘జై బాలయ్య’ అన్న శబ్దమే ఎక్కువగా వినిపిస్తోంది. ఆ నినాదాన్ని మీరు జీవితంలో తొలిసారి ఎక్కడ విన్నారు?” అని ప్రశ్నించాడు.


దీనికి బాలకృష్ణ తన స్టైల్‌కే ప్రత్యేకమైన సరదా టచ్ కలిపి, అభిమానులను ఆకట్టుకునేలా సమాధానం ఇచ్చారు. “అభిమన్యుడు తల్లి గర్భంలో ఉండగానే కురుక్షేత్ర యుద్ధంలోకి ఎలా ప్రవేశించాలో విన్నాడని కథల్లో ఉంటుంది కదా… అదే విధంగా, నేను కూడా మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే ‘జై బాలయ్య’ నినాదం విన్నాను” అని బాలయ్య చిరునవ్వుతో చెప్పారు. ఆయన మాట్లాడిన ప్రతి మాటలో అభిమానులపై ఉన్న అపార ప్రేమ, వారి నినాదాలపై ఆయనకు ఉన్న గౌరవం స్పష్టంగా కనిపించింది. దీంతో ఆయన మాట్లాడిన మాటలు బాగా వైరల్ అవుతునాయి.



అఖండ 2 రిలీజ్‌ దట్టరిల్లుతున్న తరుణంలో బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్య సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. అభిమానులు ఆయన ఈ పంచ్ స్టేట్‌మెంట్‌ను తెగ షేర్ చేస్తూ, రాబోతున్న సినిమాపై తమ ఉత్సాహాన్ని మరింతగా వ్యక్తం చేస్తున్నారు.
అఖండ 2 విడుదల కావడానికి ఇంకా కేవలం కొద్ది గంటలు మాత్రమే ఉండటంతో, ఈ సంభాషణ సినిమాపై క్రేజ్‌ను మరింత పెంచేసింది. మాస్ ఆడియెన్స్‌కే కాదు, పాన్-ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకునేలా బాలయ్య మరోసారి తన పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌ను దర్శనమివ్వబోతున్నారని అభిమానులు నమ్ముతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: