అమల, నాగ చైతన్య గురించి మాట్లాడుతూ.. పెళ్లి తర్వాత చైతూతో తనకున్న సంబంధం గురించి ఆసక్తికర విషయం చెప్పారు."నాగార్జునతో నాకు పెళ్లయినప్పుడు నాగ చైతన్య చెన్నైలో ఉన్నాడు. అతని చిన్ననాటి చదువు, పెంపకం అంతా చెన్నైలోనే జరిగింది. అందుకే ఆ సమయంలో చైతన్యతో నాకు టచ్ మాత్రమే ఉండేది. చైతూ గురించి నాకు పూర్తిగా తెలియదు.""చైతన్య కాలేజీ చదువుల కోసం హైదరాబాద్‌కు యంగ్ ఏజ్‌లో వచ్చాడు. అప్పుడే చైతూ గురించి నాకు పూర్తిగా తెలిసింది" అని అమల వివరించారు.
అలాగే, చైతూ అద్భుతమైన అబ్బాయి అని, తండ్రి మాటకు ఎప్పుడూ ఎదురు చెప్పడని, ఎంతో బాధ్యతతో ఉంటాడని అమల ప్రశంసలు కురిపించారు.తన సొంత కొడుకు అఖిల్ విషయానికి వస్తే, అతనిపై తన ప్రభావం ఎక్కువగా ఉంటుందని అమల అన్నారు. అయితే, పిల్లలిద్దరినీ పెంచిన విధానం గురించి ఆమె చెప్పిన లాజిక్ ఇప్పుడు వైరల్ అవుతోంది.ఇండిపెండెంట్‌గా పెంపకం: "మా అబ్బాయిలను ఇండిపెండెంట్‌గా పెంచాలని నేను, నాగార్జున నిర్ణయించుకున్నాం. వాళ్ళ నిర్ణయాలు వాళ్ళే తీసుకోవాలి."
ఫెయిల్యూర్స్ వెనుక కారణం: "అప్పుడే ఫెయిల్యూర్స్ ఎదురైనా వాళ్ళు నేర్చుకోగలుగుతారు. ఈ క్రమంలో చైతూ, అఖిల్‌కు కొన్ని ఫెయిల్యూర్స్ ఎదురయ్యాయి. కానీ ఈ క్రమంలో వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకోవడంలో అనుభవం పొందారు" అని ఆమె అన్నారు.చివరగా, తన కోడలు, అఖిల్ సతీమణి జైనబ్ గురించి కూడా అమల మాట్లాడారు. జైనబ్ ముస్లిం సంప్రదాయంలో పెరిగినా.. ఒక హిందూ ఫ్యామిలీలో ఎలా కలసిపోవాలో ఆమెకి బాగా తెలుసని, తమ ఇంట్లో ఇదంతా కొత్తగా ఉన్నా, బావుంది అని అమల చెప్పడం విశేషం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి