అయితే, ఇదే సమయంలో సోషల్ మీడియాలో బాలయ్యకు సంబంధించిన కొన్ని నెగిటివ్ రూమర్స్ కూడా చక్కర్లు కొడుతున్నాయి. బాలయ్యతో హీరోయిన్‌గా నటించినవారికి తరువాత పెద్దగా ఆఫర్లు రావని, వారి కెరీర్ డౌన్ అవుతుందని కొందరు ప్రచారం చేస్తున్నారు. దీనికి ఉదాహరణలుగా కొంతమంది నెటిజన్లు కొన్ని పేర్లను కూడా చెబుతున్నారు.భగవంత్ కేసరి హిట్ అయిన తర్వాత కాజల్‌కి పెద్దగా ఆఫర్లు రాలేదని, ఇప్పుడామె ప్రస్తుతానికి ఇండస్ట్రీలో కనిపించడంలేదని అంటున్నారు. అలాగే లెజెండ్, లయన్ సినిమాల్లో నటించిన రాధికా ఆప్టే కూడా తర్వాత తెలుగు ఇండస్ట్రీలో కన్పించలేదని ఒక వాదన వినిపిస్తోంది.
ఇప్పుడు ఇదే “బ్యాడ్ సెంటిమెంట్” విషయాన్ని అఖండ 2 హీరోయిన్ సంయుక్త మీనన్ పైకి కూడా లాగేస్తున్నారు. ప్రస్తుతం ఆమె తెలుగు పరిశ్రమలో మంచి అవకాశాలు అందుకుంటున్న సమయంలో, అఖండ 2 బ్లాక్‌బస్టర్ అయితేగానీ—బ్యాడ్ సెంటిమెంట్ వల్ల ఆఫర్లు తగ్గిపోతాయేమో అన్న ప్రచారం సోషల్ మీడియాలో రౌండ్లు కొడుతోంది.ఇక మరోవైపు, బాలయ్య–గోపీచంద్ మల్లినేని కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో నటిస్తున్న లేడీ సూపర్‌స్టార్ నయనతార గురించీ ఇదే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆ సినిమా హిట్ అయినా, బాలయ్య సినిమాల తర్వాత హీరోయిన్‌లకు ఆఫర్లు తగ్గుతాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. “అలా అయితే నయన్ కెరీర్‌కి ఏమవుతుందో?” అని కొందరు పోస్టులు పెడుతున్నారు.
అయితే ఈ వార్తలపై అధికారికంగా ఎవరు స్పందించకపోయినా, ఇవన్నీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న రూమర్స్ మాత్రమే. బాలయ్య సినిమాల్లో నటించే హీరోయిన్స్ ఎవరికి కూడా కెరీర్‌లో నష్టం జరుగుతుందా? లేక ఇది పక్కా అపోహా? అనే విషయం మాత్రం టైమ్ తేల్చాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి