నటసింహా నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ పవర్‌కు తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేదని అందరికీ తెలుసు. అయితే, ఇప్పుడు ఆయన ‘మాస్ హిస్టరీ’ని దేశవ్యాప్తంగా రిపీట్ చేయడానికి సిద్ధమవుతున్నారు! ‘అఖండ 2: తాండవం’ చిత్రం డిసెంబర్ 5న విడుదల కాబోతున్న నేపథ్యంలో.. ఉత్తర భారతదేశంలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్  ట్రెండ్ చూసి ఏకంగా బాలీవుడ్ వర్గాలు కూడా షాక్ అవుతున్నాయి.


పాన్ ఇండియా రేంజ్‌కు మించిన ‘మాస్’ క్రేజ్!

సాధారణంగా హిందీ మార్కెట్‌లో దక్షిణాది సినిమాలకు ఓపెనింగ్స్ రావాలంటే.. అవి తప్పనిసరిగా రాజమౌళి, ప్రభాస్, లేదా అల్లు అర్జున్ వంటి పాన్ ఇండియా స్టార్స్ సినిమాలు అయి ఉండాలి. కానీ, ఇప్పుడు బాలయ్య సినిమాకు వస్తున్న రెస్పాన్స్ అంచనాలను మించిపోయింది.అడ్వాన్స్ బుకింగ్స్ అల్లాటప్పా కాదు: ముంబై, ఢిల్లీ, పూణే వంటి ప్రధాన నగరాల్లో ‘అఖండ 2’ హిందీ వెర్షన్‌కు అడ్వాన్స్ బుకింగ్స్ మాస్ స్పీడ్ అందుకున్నాయి. చాలా చోట్ల షోలు వేసిన కొద్ది గంటల్లోనే హౌస్‌ఫుల్ అయ్యాయి. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్స్లో బుకింగ్స్ ట్రెండ్ చూస్తే.. బాలయ్యకు నార్త్‌లో కూడా తిరుగులేని ‘మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్’ ఏర్పడిందని స్పష్టమవుతోంది.



‘ఎలివేషన్స్’ పవర్: బాలయ్య సినిమాల్లో ఉండే ఎలివేషన్స్, యాక్షన్‌ను హిందీ ప్రేక్షకులు కూడా విపరీతంగా ఆస్వాదిస్తారని, ‘అఖండ’ హిందీ డబ్బింగ్ వెర్షన్ యూట్యూబ్‌లో సృష్టించిన రికార్డులే నిదర్శనం.బోయపాటి-బాలయ్య కాంబో: ఈ మాస్ డైరెక్టర్, మాస్ హీరోల కాంబినేషన్ అంటేనే నాన్-స్టాప్ యాక్షన్, పవర్ ఫుల్ డైలాగ్స్ ఉంటాయని నార్త్ ఆడియెన్స్ కూడా ఫిక్స్ అయ్యారు. అందుకే, సినిమాపై ఇంత హైప్.



బాలీవుడ్‌కు కొత్త సవాల్!

‘అఖండ 2’ అడ్వాన్స్ బుకింగ్స్, హిందీలో భారీ వసూళ్లు సాధిస్తే.. బాలయ్య తొలిసారిగా పాన్ ఇండియా లెవెల్‌లో రికార్డులు సృష్టించడం ఖాయం. ఇది బాలీవుడ్ మేకర్స్‌కు ఒక కొత్త సవాల్‌ను విసురుతుంది అనడంలో సందేహం లేదు. డిసెంబర్ 5న బాలయ్య ‘రుద్ర తాండవం’ చూడటానికి నార్త్ ఆడియెన్స్ సిద్ధంగా ఉన్నారు!

మరింత సమాచారం తెలుసుకోండి: