ప్రేమగా చూసుకుంటున్న ఆయన ఆ చూపు కొందరికి ఫన్నీగా అనిపించడంతో, ఆ ఫోటోపై నెటిజన్లు రకరకాల రియాక్షన్లు ఇవ్వడం మొదలెట్టారు. కొంతమంది ఆకతాయిలు మాత్రం ఓవర్‌గా కామెంట్లు చేస్తూ— “ఏంటి బాబూ… కళ్లే కనిపించట్లేదా? పక్కనే సమంత ఉంది. మెహెందీ చేతిలోనే ఉంది. మరి నువ్వెందుకు ఇలా ఆత్రంగా ఫోటోని జూమ్ చేస్తున్నావ్?” అంటూ ఎద్దేవా చేశారు. అయితే దీనికి సమంత అభిమానులు కూడా ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. “అయ్యో… ఆయనకి కళ్ళు కనపడక జూమ్ చేస్తున్నాడు కాదండి! సమంత తన చేతిపై ఆయన పేరును ఎలా రాసుకుందో, ఏ డిజైన్‌లో పెట్టించుకుందో దగ్గరగా చూసుకుంటున్నాడు. టెక్నాలజీ యూజ్ చేసి ఖచ్చితంగా చూడటమే!” అంటూ వారు సమాధానం ఇచ్చారు.
ఇక వీటితో ఆగకుండా, మరికొందరు సరదాగా— “రాజ్ నిడమూరుకి ఏమైనా కంటి జబ్బు ఉందా? అందుకే ఇంతగా దగ్గరగా చూసుకుంటున్నాడా?” అంటూ జోకులు పేలుస్తున్నారు. నిజానికి ఇది అంతా ఫన్‌గా చేసిన కామెంట్లే అయినా, సోషల్ మీడియాలో అవి నిజమైన చర్చలా వైరల్ అవుతున్నాయి. తమతమ కోణంలో నెటిజన్లు రియాక్ట్ అవుతుండటంతో, ఆ ఒక్క ఫోటో ప్రస్తుతం రేంజ్ దాటేలా ట్రెండ్ అవుతోంది. సమంత–రాజ్ పెళ్లి ఫోటోలను చూసే ప్రతి గ్రూప్‌లో కూడా ఇదే కొత్త టాపిక్. మొత్తం మీద… ఒకే ఒక్క మెహెందీ ఫోటోతో సోషల్ మీడియా మళ్లీ మరోసారి సమంత–రాజ్ జంటను ట్రెండింగ్‌లోకి తీసుకువచ్చింది. ఇప్పుడు వాళ్ల పెళ్లి వేడుకలో మరో ఏ ఫోటో బయటకు వస్తుందా అన్నదే అభిమానుల్లో కొత్త ఎక్సైట్మెంట్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి