బుల్లితెరపైన కానీ, వెండితెరపైన కానీ తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాధవి సినీ పరిశ్రమలో ఎంతో కష్టపడి నిలదొక్కుకున్న నటి. ‘మిర్చి’ సినిమా ద్వారా మంచి గుర్తింపు దక్కుకున్న ఆమె, ఇటీవల మాత్రం ఎక్కువగా సీరియల్స్‌లోనే కనిపిస్తోంది. సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో కొంత నిరాశ కూడా వ్యక్తం చేస్తోంది. అదే విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ—కొన్ని అవకాశాలు వచ్చినప్పుడల్లా కొందరు అసభ్యకరమైన "కమిట్మెంట్స్" కోరుతుండడంపై మండిపడింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణంలో ఎదురైన షాకింగ్ అనుభవాలను ఓపెన్‌గా పంచుకుంది.


“నాకు సరిగ్గా 12 సంవత్సరాల క్రితం ఓ దర్శకుడు ఫోన్ చేశాడు. ఇంకా ఆఫీస్ కూడా పెట్టుకోలేదని, ఇంటికే వచ్చి మాట్లాడతానన్నాడు. నేను కూడా సినిమా అవకాశం వస్తుందేమో అనుకుని ఉత్సాహంతో ‘సరే సర్… రండి’ అన్నాను. ఇంట్లో ఆ సమయంలో అమ్మ, నేను, పనిమనిషి మాత్రమే ఉన్నాం. కొద్దిసేపటికి ఆయన వచ్చాడు.” అతను వచ్చాక, తనను ఒకసారి నడవమని అడిగాడట. “ఆడిషన్ చేస్తుండొచ్చేమో” అని అనుకుని మాధవి నడిచింది. ఆ సమయంలో ఆమె డ్రెస్సింగ్ చూసిన తర్వాత దర్శకుడు, “చీర కట్టుకుని రా… అదే కాస్ట్యూమ్‌లో చూడాలి” అన్నాడు. సినిమా కోసం వచ్చిన అవకాశమని భావించి, ఆమె చీర కట్టుకుని వచ్చి నిలబడింది.



అప్పుడే అతను అసహజంగా, అసభ్యంగా ప్రవర్తిస్తూ—“కొంచెం నడుము చూపించు…” అని అన్నాడట. ఆ మాట వినగానే షాక్‌తో పాటు కోపం కూడా వచ్చింది.“నువ్వు లేరా! బయటకు వెళ్లి పో… ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడితే చెప్పుతో కొడతా!” అని గట్టిగా చెప్పిందట. వెంటనే అతడిని ఇంటి బయటకు పంపించింది.ఆమె చెప్పినట్లు—“ఒక్కసారిగా అతడు దాడి చేసి ఏమైనా చేసి ఉంటే నా పరిస్థితి ఏమయ్యేదో అన్న ఆలోచనతో నేను వణికిపోయా. నమ్మకం పెట్టుకున్నా, కానీ అతని ఉద్దేశం తప్పేమిటో అప్పుడు తెలిసింది.”‘100% లవ్’ సినిమా తర్వాత కూడా ఆమెకు ఇదే తరహా షాకింగ్ కాల్ వచ్చిందట.



“నీకొక మంచి అవకాశం ఉంది. ప్రకాశ్ రాజ్ గారి పక్కన భార్య పాత్ర. కానీ… ఐదుగురితో కాంప్రమైజ్ కావాలి” అని ఫోన్‌లో అన్నారట.దాంతో మాధవి ఒక్కసారిగా షాక్ అయి. “నేను అలాంటి దానిని కాదు. ఆ టైప్‌ కాదండి నేను” అని చెప్పి ఫోన్ కట్ చేసిందట. మాధవి చెప్పిన ఈ సంఘటనలు, సినీ ప్రపంచంలో మహిళలు ఎదుర్కొంటున్న నిజమైన కష్టాలు, అణచివేత, అనుచిత ప్రవర్తన ఎలా ఉంటాయో స్పష్టంగా చూపిస్తున్నాయి. ఆమె ఎంత కష్టపడి, నైతిక విలువలు కాపాడుకుంటూ తన జర్నీ కొనసాగించిందో ఆమె మాటల్లోనే తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: