- ( టాలీవుడ్ , అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో , నందమూరి బాలకృష్ణ నటించిన ‘ అఖండ 2 ’ సినిమా విడుదలకు అడ్డంకులు ఏర్పడిన నేపథ్యంలో, ఈ వ్యవహారంలో బాల‌కృష్ణ అల్లుడు , ఏపీ మంత్రి నారా లోకేష్ పాత్ర పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. 14 రీల్స్ ప్ల‌స్ సంస్థపై ఉన్న బకాయిల కారణంగా విడుదలకు కోర్టు స్టే రావడంతో సినిమా నిలిచిపోయింది. అయితే తాజా రాజకీయ పరిస్థితుల్లో బాలకృష్ణలోకేష్ మధ్య ఉన్న కుటుంబ సంబంధాలు, మరియు బాలకృష్ణ టీడీపీలో ఉన్న కీలక స్థానం నేపథ్యంలో, లోకేష్ ఈ సమస్యలో మధ్యవర్తిత్వం చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.  


ఈ వివాదం వల్ల బాలకృష్ణ అఖండ 2 - తాండ‌వం సినిమా మాత్రమే కాదు, రాజకీయంగా కూడా కొన్ని ప్రతికూలతలు ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అభిమానులు, పార్టీ వర్గాలు ఈ విషయంలో త్వరిత పరిష్కారం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు సమాచారం.  ఇక ఈ సినిమా నిర్మాతలు ఈ పరిస్థితి నుంచి బయట పడటానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, కోర్టు ఆదేశాల నేపథ్యంలో పరిస్థితి క్లిష్టంగా మారింది. ఈ నేపథ్యంలో, లోకేష్ జోక్యం చేసుకుంటే సమస్య త్వరగా పరిష్కారమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు పరిశ్రమ వర్గాలు. ఏదేమైనా ‘ అఖండ 2 ’ సమస్యపై రాజకీయ రంగు ఎక్కుతుందా ? లోకేష్ ఎంట్రీతో పరిష్కారం సులభమవుతుందా? అనే విషయంపై పరిశ్రమలో ఆసక్తి నెలకొంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: