దర్శకుడు శ్రీను వైట్లహీరో శర్వానంద్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకోబోతున్న తాజా చిత్రంపై ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ చిత్రంలో ఒక ప్రత్యేక గెస్ట్ రోల్ ఉండబోతుందని, అది కథను ముందుకు నడిపించే అత్యంత కీలక పాత్రగా నిలవనుందనే వార్తలు వెలువడుతున్నాయి. ప్రత్యేకంగా ఈ పాత్ర చాలా ఫన్నీగా, ఎంటర్‌టైనింగ్‌గా ఉండబోతోందట. అంతేకాదు, ఆ పాత్రను ఒక ప్రముఖ మలయాళ నటుడు పోషించనున్నారని టాక్.ఇక హీరోయిన్ విషయానికి వస్తే… ఇటీవల తమ ‘మ్యాడ్’‌, ‘8 వసంతాలు’ సినిమాలతో యూత్ హృదయాలను దోచుకున్న అందాల భామ అనంతిక సునీల్ కుమార్‌ ను ఈ చిత్రానికి నాయికగా ఫైనల్ చేసినట్లు తెలిసింది. ‘8 వసంతాలు’ చిత్రంతోనే యువత గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ బ్యూటీ, శర్వానంద్ సరసన ఏ మేరకు మెస్మరైజ్ చేస్తుందో చూడాలి.


మరోవైపు దర్శకుడు శ్రీను వైట్ల కెరీర్ గురించి చూస్తే, గోపీచంద్ హీరోగా తీసిన యాక్షన్ కామెడీ “విశ్వం” ఆశించిన ఫలితాలను అందుకోకపోవడంతో, వెంటనే మరొక మంచి కథతో టాలీవుడ్‌లో తిరిగి బిజీ అవ్వాలని డైరెక్టర్ ఎగ్జాటింగ్‌గా ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుస్తోంది. అదే ప్రయత్నంలో శర్వానంద్‌ను సంప్రదించిన సమాచారం అందుతోంది.ఈ చిత్ర కథ ప్రకారం, చిన్నప్పటి తెలియని వయసులో హీరో చేసిన ఒక తప్పు, భవిష్యత్తులో అతని జీవితంపై ఎలా ప్రభావం చూపుతుందనే పాయింట్ చుట్టూ కథ సాగుతుందట. భావోద్వేగాలు, కామెడీ, యాక్షన్‌ కలగలిపి పెద్ద ప్యాకేజీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించేందుకు శ్రీను వైట్ల ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడని సమాచారం.



ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జోరుగా కొనసాగుతోంది. అన్ని అనుకూలిస్తే ఈ ఏడాది చివరి నాటికి ఈ కాంబినేషన్‌లో సినిమా సెట్స్‌ మీదకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో మరొక ముఖ్య హీరో కూడా కనిపించనున్నాడన్న ప్రచారం జోరుగా జరుగుతుంది. అది నిజమైతే ఇది పూర్తిగా మల్టీ స్టారర్ ఫార్మాట్‌లో రూపొందే అవకాశముంది.ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో మల్టీ స్టారర్స్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. పెద్ద హీరోలు, మధ్య తరగతి హీరోలు అందరూ మల్టీ స్టార్ల్ సినిమా ట్రెండ్‌లోకి దూకుతుండడంతో, ఈ దోమ చివరికి శర్వాకి కూడా కుట్టేసిందంటూ సోషల్ మీడియాలో సరదాగా కామెంట్లు వైరల్ అవుతున్నాయి.



ప్రత్యేకంగా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్నారన్న విషయమే అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. భారీ బడ్జెట్, శ్రద్దగొలిపే నిర్మాణ విలువలతో చిత్రాన్ని పెద్ద కాన్వాస్‌పై తెరకెక్కించేందుకు మైత్రీ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి… దర్శకుడు శ్రీను వైట్లహీరో శర్వానంద్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అవుతోంది. అంతా బాగా జారితే, ఈ సినిమా శర్వా కెరీర్‌లో మరో ప్రత్యేక స్థానాన్ని సంపాదించే అవకాశం ఉన్నట్టే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: