- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ అఖండ 2 - తాండవం ’ రిలీజ్ అనూహ్యంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ పరిణామం ఒక్క బాలయ్య ఫ్యాన్స్‌కే కాదు, అప్పుడే రిలీజ్‌కి సిద్ధంగా ఉన్న మిడ్‌రేంజ్ సినిమాలకు కూడా పెద్ద సమస్యగా మారింది. డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సిన ఈ మాస్ ఎంటర్‌టైనర్ అఖండ సీక్వెల్ పెద్ద ఎక్స్‌పెక్టేషన్‌తో ఉండటంతో, ఆ రోజుకు బాల‌య్య సినిమాకు పోటీగా వెళ్ల‌లేక చాలా చిన్న‌, మిడ్ రేంజ్ సినిమాలు త‌మ సినిమాల రిలీజ్ డేట్లు వాయిదా వేసుకున్నాయి. అన్నీ పూర్త‌య్యాక .. ప్రీమియ‌ర్ షోల‌కు అంద‌రూ రెడీ అవుతోన్న వేళ .. చివరి నిమిషంలో ‘అఖండ 2’ నిలిపివేయడంతో థియేటర్లు ఖాళీగా ఉండిపోయాయి. ఈ పరిస్థితిని ఊహించని మిడ్‌రేంజ్ సినిమాలు తమ విడుదల తేదీలను మార్చుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.


ఇప్ప‌టికే రామ్ ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా తో పాటు మ‌రికొన్ని సినిమాలు విడుదలై థియేటర్లలో మిక్స్డ్ టాక్‌తో నడుస్తుండగా, 'అఖండ 2' వాయిదా వల్ల అవకాశం దక్కినా, సడెన్‌గా ప్రమోషన్ చేయలేక అవకాశాన్ని వదిలేశాయి. అంతేకాదు, ‘అఖండ 2’ విడుదల ఎప్పుడైనా ఉండవచ్చన్న అనిశ్చితి తో ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు కొత్త సినిమాలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. అఖండ 2 చెప్ప‌కుండా ఎప్పుడు రిలీజ్ డేట్ వేస్తారో ? అన్న డౌట్లు అయితే అంద‌రిలోనూ ఉన్నాయి. ఈ పరిణామం ఇండస్ట్రీలో రిలీజ్ ప్లానింగ్ పై ప్రశ్నలు లేవనెత్తుతోంది. పెద్ద సినిమాల నిర్ణయాలు మిడ్‌రేంజ్ సినిమా ల రిలీజ్ డేట్ల పై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో, భవిష్యత్‌లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు మరింత సత్వర నిర్ణయాలు తీసుకునే అవసరం కనిపిస్తోంది. దీనిపై టాలీవుడ్ లో అంద‌రూ ఓ క్లారిటీకి రావాల్సిన అవ‌స‌రం అయితే ఎంతైనా క‌నిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: