ఈ మీటింగ్‌లో సినిమా విడుదలకు సంబంధించిన చివరి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో ఒక పెద్ద సినిమా లీగల్ ఇష్యూలతో ఇలా చివరి నిమిషంలో ఆగిపోవడం అరుదైన ఘటన. ముఖ్యంగా నిర్మాతలపై ఉన్న ఆర్థిక సమస్యలు, కోర్టు స్టే, అప్పుల బకాయిలు వంటి అంశాల కారణంగా సినిమా విడుదలకు బ్రేక్ పడింది. ఇప్పుడు ఈ సమస్యలను చక్కదిద్దడానికి పలు చర్చలు కొనసాగుతున్నాయి. ఓ వైపు సినిమా యూనిట్ థియేటర్ రిలీజ్‌కి సిద్ధంగా ఉండగా, మరోవైపు ఓటీటీ డీల్స్ కూడా వేచి ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్ వంటి ప్లాట్‌ఫామ్స్‌తో వచ్చిన ఒప్పందాల ప్రకారం, సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాతే స్ట్రీమింగ్ ప్రారంభం కావాలి. దీంతో థియేటర్ విడుదల ఆలస్యం వల్ల ఓటీటీ రిలీజ్ కూడా ఆగిపోయింది. సినిమా 12న రిలీజ్ చేయాలని లేనిపక్షంలో తాము కట్టిన అడ్వాన్స్‌లలో కొంత డిస్కౌంట్ ఇచ్చి వెనక్కు ఇవ్వాలని కోరుతున్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో, సోమవారం వచ్చే తుది ప్రకటనపై ఇండస్ట్రీ వర్గాలు, అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఒకవేళ ప్రతికూల నిర్ణయం వస్తే, రిలీజ్ మరింత ఆలస్యం కావొచ్చు. లేదా సమస్యలు పరిష్కారమైతే, కొత్త రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఫైనల్ గా “ అఖండ 2 ” విడుదలపై నెలకొన్న ఉత్కంఠకు త్వరలో తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. డిసెంబర్ 9న జరగబోయే నిర్ణయమే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా ? లేక మరింత గందరగోళానికి దారితీస్తుందా ? అన్నది వేచి చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి