ఏ బ్యానర్‌తో సినిమా చేయాలి? ముందే ఇన్వెస్టిగేషన్!
వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, బాలయ్య ఇకపై ఏ బ్యానర్‌లో సినిమా చేయాలన్నా ఆ బ్యానర్‌కి సంబంధించిన క్లియర్ డీటెయిల్స్ ముందుగా తెలుసుకోవాలన్న నిర్ణయం తీసుకున్నారట.
* ఆ బ్యానర్‌కి ఎలాంటి ఫైనాన్స్ ఇష్యూలున్నాయా?
* మునుపటి సినిమాలకు పెండింగ్ బకాయిలు ఉన్నాయా?
* డిస్ట్రిబ్యూషన్‌లో సమస్యలున్నాయా?
* ఆ సంస్థతో ఇతర హీరోలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చాయా?
ఈ విషయాలన్నీ ముందుగా తెలుసుకున్న తరువాతే సినిమా సైన్ చేసేందుకు బాలయ్య రెడీ అవుతారట.ఈ వ్యవహారాలన్నింటిని పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఒక ప్రొఫెషనల్ టీమ్‌ను బాలయ్య ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఆ టీమ్ ముందుగా పూర్తి వివరాలు సేకరించి రిపోర్ట్ అందిస్తుందని తెలుస్తోంది. బాలయ్య అఖండ 2 విషయంలో జరిగిన తప్పు, రిలీజ్ లో వచ్చిన గందరగోళం, రిలీజ్ అడ్జస్ట్మెంట్ సంబంధించిన సమస్యలు మళ్లీ దొర్లకుండా చేయడమే ఈ ప్రొసెస్ ప్రధాన ఉద్దేశం.
ప్రతి సినిమా కోసం ముందే ఫైనాన్షియల్, టెక్నికల్, రిలీజ్ ప్లానింగ్, డిస్ట్రిబ్యూషన్ అంశాలు సెట్ చేసి, అన్ని డాక్యుమెంట్స్ క్లీయర్ అయిన తర్వాతే సెట్‌పైకి వెళ్ళాలని బాలయ్య డెసిషన్ తీసుకున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఇకనైనా బాలయ్య సినిమాలకు ఇలాంటి అంతరాయాలు రావద్దన్న కోణంలో బాలయ్య ముందుగా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారట.తెలుగులో టాప్ మాస్ స్టార్‌గా, ఫ్యాన్స్‌కి ఇమేజేషన్‌కి తగ్గట్టుగా సినిమాలు తీస్తున్న బాలయ్య—ఇకపై మరింత జాగ్రత్తగా, ప్లాన్ బేస్డ్ గా పని చేయాలని నిర్ణయం తీసుకోవడం ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది.ఈ నిర్ణయం భవిష్యత్తులో బాలయ్య సినిమాలపై మంచి పాజిటివ్ ఇంపాక్ట్ చూపే అవకాశముంది!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి