- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

కోలీవుడ్ సీనియర్ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన సినిమా నరసింహ. ర‌మ్య‌కృష్ణ - సౌందర్య పాత్రలు హైలెట్గా నిలిచిన ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని రజనీకాంత్ అధికారికంగా ప్రకటించారు. టైటిల్ కూడా వెల్లడించడంతో అభిమానులు సంబరపడుతున్నారు. ఇక రజనీకాంత్ డిసెంబర్ 12న 75 ఏళ్లు పూర్తి చేసుకుని అన్నారు. ఈ సందర్భంగా ఆయన సూపర్ హిట్ సినిమా నరసింహా ను రీ రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్‌ ప్రచారంలో భాగంగా రజనీకాంత్ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. అయితే ఈ సినిమాలో రమ్యకృష్ణ లేడీ విలన్ నీలంబరి పాత్రలో అదరగొట్టేశారు. ఈ పాత్ర ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో అలా నిలిచిపోతుంది. అయితే ఈ పాత్ర కోసం మొదట ఐశ్వర్యారాయ్ ను సంప్రదించినట్టు రజినీకాంత్ తెలిపారు.


నరసింహ కథను తానే రాశాను అని ... తన స్నేహితుల పేర్లతో నిర్మించాను అని తెలిపారు. ఇందులో ఎంతో పవర్ఫుల్ పాత్ర నీలాంబ‌రి కోసం ముందుగా ఐశ్వర్య రాయ్ ని సంప్రదించామని .. ఆమె ఆసక్తి లేదని చెప్పారని చెప్పారు. ఆ తర్వాత శ్రీదేవి - మాధురి దీక్షిత్ పేర్లను కూడా పరిశీలించాం అలా చాలామంది పేర్లు చర్చించుకున్న తర్వాత రమ్యకృష్ణ అయితే న్యాయం చేయగలరని చెప్పారు. చివరకు రమ్యకృష్ణ పేరును ఫైనల్ చేసినట్టు రజిని తెలిపారు. 1999లో విడుదలైన నరసింహ రజనీ కెరీర్ లోనే బ్లాక్ బ‌స్టర్ హిట్లర్ ఒకటిగా నిలిచింది. రజనీకాంత్ టైటిల్ పాత్ర పోషించగా ఆయన భార్య వసుంధర పాత్రలో సౌందర్య నటించారు. రమ్యకృష్ణ నటించిన నీలాంబ‌రి పాత్ర సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమా వ‌చ్చి ఇప్పటికే 26 ఏళ్ళు అవుతున్న ఈ పాత్ర నేటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ప్రస్తుతం రజనీకాంత్ రమ్యకృష్ణ కలిసి జైలర్ 2 లో నటిస్తున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: