ఇలాంటి ప్రేమను ఎప్పటికీ గుర్తుంచుకునే చరణ్, తాజాగా పెద్ది సినిమా సందర్బంగా జపాన్ సందర్శించారు. అక్కడ ఆయనను చూడాలి అంటూ గంటల తరబడి ప్రయాణించి వచ్చిన అభిమానులు ఉప్పొంగిపోయారు. వారితో రామ్ చరణ్ ఎంతో మనస్ఫూర్తిగా మాట్లాడటం, చిరునవ్వుతో పలకరించడం, ఆటోగ్రాఫ్ ఇవ్వడం అభిమానులను అమితంగా ఆనందపరిచింది. జపాన్ అభిమానులు రామ్ చరణ్ పూర్వ చిత్రాల నుండి ఎన్నో స్టిల్స్ ప్రింట్ చేసి, వాటిని అందంగా కట్ చేసి ‘గ్రీటింగ్ కార్డ్స్’ రూపంలో తయారు చేసి రామ్ చరణ్‌కి అందించారు. ఆ అందమైన ప్రేమను చూసి చరణ్ నిజంగానే ఆశ్చర్యపోయాడు.
ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతోన్న పెద్ది సినిమాలో క్రికెట్ నేపథ్యం ముఖ్య పాత్ర పోషిస్తున్నందున, ప్రత్యేకంగా కొన్ని క్రికెట్ బ్యాట్స్‌పై రామ్ చరణ్ తన సంతకం చేసి జపాన్ అభిమానులకు అందించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. అంతేకాదు రామ్ చరణ్ ప్రత్యేకంగా రూపొందించిన టీషర్ట్స్‌ను కూడా అభిమానులకు బహుమతిగా ఇచ్చారు.అక్కడ అభిమానులు కనిపించిన విధానం, వారి ఆనందం, చరణ్‌తో తీసుకున్న ఫోటోలు—అన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వీడియోలు ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతున్నాయి.
జపాన్ ఫ్యాన్స్ చూపుతున్న ఈ ప్రేమను చూసి తెలుగు సినిమాకు, ముఖ్యంగా రామ్ చరణ్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంత పెద్ద గౌరవం, ప్రేమ లభిస్తోందో మరోసారి స్పష్టమవుతోంది. రామ్ చరణ్ కూడా ఎంతో హృదయపూర్వకంగా ఈ అభిమాన ప్రేమను స్వీకరిస్తూ, భారతీయ సినీ ప్రపంచానికి ఒక అంతర్జాతీయ ప్రతిభగా వెలుగునిస్తున్నారు.ఇక పెద్ది సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎలా స్పందన రాబడుతుందో అన్న ఆసక్తి కూడా పెరుగుతోంది. రామ్ చరణ్ ఈ విజిట్‌తో మళ్లీ జపాన్ మీడియా, జపాన్ ప్రజల్లో హాట్ టాపిక్‌గా మారడం ప్రత్యేకం. మొత్తం మీద ఈ అపూర్వమైన అభిమాన ప్రేమ చూసేవారికి కూడా హార్ట్ టచింగ్‌గా అనిపించకుండా ఉండదు!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి