ఈ క్రేజ్‌తోనే ఇప్పుడు ఆయన నటించిన తాజా చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రం డిసెంబర్ 18న గ్రాండ్‌గా రిలీజ్ కావాల్సి ఉండగా, ఇప్పుడు ఆ విడుదల తేదీపై చిన్నపాటి అనిశ్చితి నెలకొన్నట్లు కోలీవుడ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. సినిమాలోని కంటెంట్, టీమ్, మ్యూజిక్—అన్ని పాజిటివ్ బజ్ ఉన్నా, విడుదలకు కేవలం కొద్ది రోజులే మిగిలి ఉన్నప్పటికీ ప్రమోషన్స్ చాలా స్లోగా సాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకంగా తెలుగులో అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రమోషనల్ వీడియో, ఇంటర్వ్యూలు లేదా సాంగ్స్ కూడా సరిగా రిలీజ్ కాలేదు. అందుకే డిసెంబర్ 18 రిలీజ్ అనేది కొంచెం అనుమానాస్పదంగా ఉందని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్‌కు టాలెంటెడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించడం సినిమాపై ఆసక్తి మరింత పెంచుతోంది. హీరోయిన్‌గా అందాల భామ కృతి శెట్టీ నటిస్తుండగా, పేరొందిన నటులు ఎస్.జె.సూర్య, కామెడీ స్టార్ యోగి బాబు, గౌరి జి కిషన్, డైరెక్టర్-యాక్టర్ మిస్కిన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మ్యూజిక్ ప్రపంచంలో ప్రత్యేక శబ్దం కలిగిన అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటం కూడా ఈ చిత్రానికి పెద్దప్లస్ పాయింట్‌గా మారింది.
ఇప్పటి వరకు తాజా ట్రెయిలర్ లేదా రిలీజ్ డేట్ రీకన్ఫర్మేషన్ విడుదల కాలేకపోవడంతో ప్రేక్షకులు కొంత నిరాశ చెందుతున్నా, మేకర్స్ త్వరలోనే అధికారిక ప్రకటనతో వస్తారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి, ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారో అనేది తెలుసుకోవాలంటే మరికొద్ది రోజులు ఓపికగా వెయిట్ చేయాల్సిందే అని చెప్పాలి. ఇంత మంచి రిలీజ్ డేట్ ఛాన్స్ మిస్ చేసుకుంటే ప్రదీప్ రాంగ్ స్టెప్ వేసిన్నట్టే అంటున్నారు ప్రముఖులు. కొందరు ట్రోల్ కూడా చెస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి