ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివకు సంబంధించిన ఒక సెన్సేషనల్ వార్త సినిమా ఇండస్ట్రీలోనే కాదు సోషల్ మీడియాలో కూడా భారీ స్థాయిలో ట్రెండింగ్ అవుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తన ప్రత్యేకమైన స్టైల్, కంటెంట్, సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలతో మంచి బ్రాండ్ వెల్యూ ఏర్పరచుకున్న కొరటాల శివ, ఇప్పుడు పూర్తిగా కొత్త దిశలో ఆలోచిస్తున్నారనే మాట గట్టిగా వినిపిస్తోంది. తెలుగు సినీ ప్రేక్షకులకు కొరటాల శివ అనే పేరు అంటే ఒక హిట్‌కు హామీ, ఒక కథలో లేయర్స్, మరియు సోషల్ పాయింట్‌ తో కూడిన స్ట్రాంగ్ స్క్రీన్‌ప్లే గుర్తొస్తుంది. ‘మిర్చి’, ‘జనతా గ్యారేజ్’, ‘భరత్ అనే నేను’, ‘‘దేవర పార్ట్ 1’ వంటి చిత్రాలతో ఇప్పటికే తన ప్రత్యేకత నిరూపించుకున్న కొరటాల, ఇప్పుడు కెరీర్‌లో భారీ మలుపు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారని ఇండస్ట్రీ టాక్.


వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం – దేవర సినిమా పూర్తయ్యాక, కొరటాల ఎన్టీఆర్‌తో వచ్చే తదుపరి చిత్రం ఫిక్స్‌ అయ్యిందనుకుంటే, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందన్న టాక్ బాగా పాపులర్ అవుతోంది. దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన బయటకు రానప్పటికీ, ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం మాత్రం ఇదే నిజమని చెబుతోంది. దేవర ప్రాజెక్ట్ తరువాత కొరటాల శివ కొన్ని వ్యక్తిగత ప్లాన్స్ పెట్టుకున్నట్టు సమాచారం. ముఖ్యంగా, సినిమా దర్శకత్వం నుండి కొంతకాలం బ్రేక్ తీసుకుని పూర్తిగా నటన వైపుకి మళ్లాలని ఆలోచిస్తున్నారట.



ముందు కూడా చాలామంది స్టార్ డైరెక్టర్లు ఇలాగే చేశారు. కొంతకాలం డైరెక్షన్ లో దుమ్ము లేపి, ఆ తరువాత నటించాలనే తనలో ఉన్న కోరికను ఫాలో అయి నటన వైపు మళ్లిన దర్శకులు ఇద్దరు ముగ్గురు కాదు. చాలా మందే. ఇప్పుడు అదే రూట్‌లో కొరటాల కూడా వెళ్తున్నారని, ఇంకొంతమంది అభిమానులు హ్యాపీగా ఈ నిర్ణయాన్ని వెల్కమ్ చేస్తున్నారంటే ఆశ్చర్యం లేదు. కొరటాల శివను ఇప్పటి వరకు ప్రేక్షకులు ‘స్టార్ డైరెక్టర్‌గా’ మాత్రమే చూసినప్పటికీ, ఇకపై పూర్తిగా నటుడిగా కూడా చూడడానికి సిద్ధం కావాలని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. “కొరటాల గారిని డైరెక్టర్‌గా మాత్రమే కాదు, మంచి నటుడిగా కూడా గుర్తుపెట్టుకుంటాం” అంటూ ఫ్యాన్స్ మెసేజ్ చేస్తున్నారు. కొరటాల శివ డైరెక్టర్‌గానే కాకుండా నటుడిగా కూడా తన క్యారెక్టరైజేషన్‌ను ప్రూవ్ చేసే టైమ్ వచ్చిందని చెప్పొచ్చు. దేవర తర్వాత ఆయన ఎలాంటి పాత్రల్లో కనిపిస్తారు ? ఎలాంటి సినిమాలు చేస్తారు ? అనే ఆసక్తి ఇప్పుడు ఫుల్ స్ధాయిలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: