ప్రస్తుతం కోలీవుడ్‌లో అత్యంత టాలెంటెడ్ హీరోలలో ఒకరిగా పేరొందిన కార్తి, తన కొత్త సినిమా లైనప్‌తో మరోసారి సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇప్పటికే “అన్నగారు వస్తారు” టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో తెలుగు–తమిళ ప్రేక్షకులలో ఆసక్తి పెరిగిపోయింది. పైగా ఖైదీ చిత్రం అపారమైన విజయం సాధించడంతో, ఇప్పుడు ఖైదీ–2 కోసం కూడా భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి.అయితే ఈ ప్రాజెక్టుల మధ్యలోనే కార్తి ఇటీవల తన తదుపరి సినిమాలపై ఇచ్చిన అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. టాలీవుడ్‌లో “అంటే సుందరానికి, ఇంకా ఇటీవల విడుదలైన సరిపోదా శనివారం” లాంటి ఫిల్మ్స్‌తో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్న యంగ్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో కలిసి సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది.


రీసెంట్‌గా వివేక్ ఆత్రేయ ఓ కొత్త కథను నరేట్ చేశాడని, ఆ కథకు మంచి పొటెన్షియల్ ఉందని, అలాగే నెక్స్ట్ స్టేజ్ నరేషన్ కోసం తాను వేచిచూస్తున్నానని కార్తి చెప్పాడు. దీనితో వీరిద్దరి కాంబినేషన్ పక్కాగా సెట్ అయినట్టే అని అభిమానులు సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు. ఇక నెటిజన్స్ మాత్రం కార్తిని ఆకాశానికెత్తేస్తున్నారు. స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలా కాకుండా, ప్రతిభ ఉన్న దర్శకులను గుర్తించి, వారికి అవకాశం ఇస్తున్న హీరో అంటే కార్తి మాత్రమే అని ప్రశంసలు కురిపిస్తున్నారు. టాలెంట్‌కు విలువ ఇచ్చే హీరో, మంచి కథలను ఎంచుకునే హీరో, ప్రయోగాలకు వెనుకాడని హీరో అనే పేరును మళ్లీ నిరూపించుకున్నాడని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.



ప్రస్తుతం సోషల్ మీడియాలో “కార్తి ఈసారి మరో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడు”, “తక్కువ హంగామాతో పెద్ద బ్లాస్ట్ ఇవ్వగల హీరో” అనే హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఒక్క లైనప్‌ అప్‌డేట్‌తో సోషల్ నెట్‌వర్క్ మొత్తాన్ని షేక్ చేసిన కార్తికి, ఇప్పుడు కోలీవుడ్ మాత్రమే కాదు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా క్రేజ్ అమాంతం పెరిగిపోయిందనే చెప్పాలి..!

మరింత సమాచారం తెలుసుకోండి: