అది మాత్రమే కాదు… అప్పటి నాగార్జున ఎలా ఉంటే, ఇప్పటికీ అదే లుక్, అదే స్టైల్, అదే యంగ్ వైబ్స్‌తో మెరుస్తున్నారని సేతుపతి పేర్కొన్నారు. “నా పిల్లలు కూడా పెద్దవాళ్లుగా మారిపోయారు. కానీ నాగార్జున మాత్రం ఇప్పటికీ 30 ఏళ్ల హీరోలా కనిపిస్తున్నారు. అసలు ఆయన వయసు పెరగడం ఎందుకు లేదు? ఏ మ్యాజిక్ జరుగుతోంది?” అంటూ సరదాగా ప్రశ్నించారు.అంతటితో ఆగకుండా—యాంటీ ఏజింగ్ పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు ముందుగా నాగార్జునపై టెస్టులు చేయాలని తాను సూచిస్తానని చిరునవ్వుతో చెప్పారు. ఆయన జుట్టు ఒక్క తెల్ల వెంట్రుక కూడా లేకుండా అలాగే నలుపుగానే ఉండటం, ఎనర్జీ మాత్రం రోజురోజుకు పెరిగిపోవడం చూస్తే ఆశ్చర్యమేస్తోందని సేతుపతి అన్నారు. ఎంత సినిమాలు చేసినా, ఎంత బిజీగా ఉన్నా, ఎంత పెద్ద స్టార్ అయినా… నాగార్జున ప్రతి సారి స్క్రీన్‌పై కనిపించే తీరు మాత్రం యూత్‌ఫుల్‌గా, స్టైలిష్‌గా, అలరిస్తూ ఉంటుందని ప్రశంసించారు.
ప్రస్తుతం విజయ్ సేతుపతి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఫ్యాన్స్ మాత్రమే కాదు, సినీ ప్రముఖులు కూడా ఆయన మాటలను షేర్ చేస్తూ నాగార్జున ఎప్పటికీ ఓల్డ్ కాకపోయే స్టార్ అని కామెంట్ చేస్తున్నారు. నాగార్జున, మోహన్‌లాల్, విజయ్ సేతుపతి ఒకే స్టేజ్‌పై కనిపించిన ఈ ఇంప్రెస్ అవుటింగ్ ప్రస్తుతం దక్షిణ భారత సినీ వర్గాల్లో ప్రధాన చర్చాంశంగా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి