టాలీవుడ్‌లో ‘ అఖండ 2 ’కు సంబంధించి నిర్మాతలు విడుదల డేట్‌ను ఫిక్స్ చేసిన తర్వాత, చాలా సినిమాల విడుదల షెడ్యూలు మళ్ళీ మారాల్సి వచ్చింది. ఈ డిసెంబర్ 12 తేదీన తమ సినిమాలు కొన్ని రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు అఖండ 2 ఈ నెల 12న డేట్ ఫిక్స్ చేసుకోవడంతో ఇప్పుడు మిగిలిన సినిమా షెడ్యూల్ ప్లానింగ్ మార్చుకోవాల్సి వచ్చింది. ముందుగా అఖండ 2 ను డిసెంబర్ 5 న రిలీజ్ అనుకున్నారు. ఇప్పుడు 12కు వాయిదా వేయడంతో ఇప్పుడు 12న రావాలనుకున్న కొన్ని సినిమాలు ఇప్పుడు తమ షెడ్యూల్‌ను మళ్లీ మార్చుకోవాల్సిన పరిస్థితి.
డిసెంబర్ 12న మొత్తం 16 సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. వీటిలో మోగ్లీ, ఈషా లాంటి క్రేజ్ ఉన్న సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అఖండ 2 12న రావడంతో ఈ రెండు సినిమాలు డైలమాలో పడ్డాయి. అఖండ 2 లాంటి పెద్ద సినిమా ఇప్పుడు థియేటర్ల లోకి రావడంతో ఇప్పుడు చిన్న సినిమాలు ఎప్పుడు తమ సినిమాలు రిలీజ్ చేయాలో తెలియక డైలమాలో పడ్డారు. ఇప్పుడు చిన్న సినిమాలు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తమ సినిమాలు ఎప్పుడు రిలీజ్ చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఈ నెల 19న 'అవతార్ -3' ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. దాంతో చిన్న సినిమాలు మరింత వెనక్కి వెళ్లి పోవాల్సి ఉంది. అయితే కొందరు చిన్న సినిమాల నిర్మాతలు సైతం ధైర్యం చేసి పెద్ద సినిమాల తో పాటు తమ సినిమా లను సైతం రిలీజ్ చేస్తుంటారు.
ఇక ఇప్పుడు అవతార్ 19న వస్తుంటే... ఆ తర్వాత సంక్రాంతి సినిమాల హడావిడి ఉంటుంది. అప్పుడు చిన్న సినిమాలు అయితే జనవరి చివరకు లేదా ఏ ఫిబ్రవరికో వెళ్లి పోవాల్సి ఉంటుంది. అయితే మోగ్లీ నిర్మాతలు మాత్రం అఖండ 2 వచ్చిన మరుసటి రోజే తమ సినిమాను థియేటర్లలోకి ధైర్యంగా తీసుకు వస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి