- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

పౌరాణికం, జానపదం, జీవిత చరిత్ర, ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్, ఆక్షన్ డ్రామా, ఫామిలీ డ్రామా ఇలా అన్ని జోనర్ లో నటించింది ఇప్పుడు సీనియర్ హీరోలలో బాలయ్య ఒక్కడే అని చెప్పాలి. ఫ్యాక్షన్ సినిమాలు తప్ప హిట్లు లేవు అనుకునే వాళ్ల‌కు చెప్పాల్సిన ఆన్స‌ర్లు చాలానే ఉన్నాయి. 1986లో వరుసగా  6 రిలీజ్ చేసి ఒకే సంవత్సరంలో డబల్ హ్యాట్రిక్ కొట్టి చూపించాడు బాల‌య్య‌. ఒకేరోజు తాను నటించిన రెండు సినిమాలు రిలీజ్ చేసి ఏ సినిమాకి ముందు వెళ్తారో అని అభిమానులకే ఒక ఛాలెంజ్ చేసిన ఘ‌త‌న బాల‌య్య‌దే. రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ కొట్టడం బాలయ్యకే సాధ్యం.తరువాత రాయలసీమ బ్యాక్ డ్రాప్ సినిమాలు చేసి దుమ్ము దులిపేశాడు.


ఇంకా రికార్డులకు విషయానికి వస్తే
50 డేస్ మూవీస్ - 72
100 డేస్ మూవీస్ - 54
175 డేస్ మూవీస్ - 19
365 డేస్ మూవీస్ - 12
ఆల్ టైం ఇండియా రికార్డు 500 డేస్ మూవీస్ - 2
డబుల్ హ్యాట్రిక్ ఇన్ సింగిల్ ఇయర్ 1986లో 6 మూవీస్ ఈ అరుదైన రికార్డ్ బాల‌య్య‌కు మాత్ర‌మే సొంత‌మైంది.


ఇక ఎన్టీఆర్ బ‌యోపిక్ రెండు సినిమా లు 2019 లో వ‌చ్చి డిజాస్ట‌ర్ అయ్యాయి. అదే యేడాది చివ‌ర్లో రూల‌ర్ సినిమా కూడా డిజాస్ట‌ర్‌. మూడు వ‌రుస డిజాస్ట‌ర్ల త‌ర్వాత బాల‌య్య ఆ త‌ర్వాత క‌రోనా గ్యాప్ త‌ర్వాత అఖండ సినిమా తో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి సింహంలా గ‌ర్జించాడు. నాటి నుంచి నేటి వ‌ర‌కు బాల‌య్య గ‌ర్జ‌న ఆగ‌లేదు. వ‌రుస‌గా నాలుగు సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమాల‌తో దూసుకు పోతున్నాడు. అఖండ - వీర‌సింహా రెడ్డి - భ‌గ‌వంత్ కేస‌రి - డాకూ మ‌హారాజ్ నాలుగు సినిమాలు సూప‌ర్ డూప‌ర్ అయ్యాయి. ఇప్పుడు అఖండ 2 సినిమా తో థియేట‌ర్ల‌లోకి దిగుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: