- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

ఎట్ట‌కేల‌కు అఖండ 2 ఊరించి ప‌లు వాయిదాలు ప‌డుతూ ఎట్ట‌కేల‌కు థియేట‌ర్ల లోకి వ‌చ్చింది. సినిమా స్టార్టింగ్‌లోనే అఖండ సినిమా రీ క్యాప్ సీన్లు వాడుకున్నారు. త‌ర్వాత క‌థ రెండు, మూడు లేయ‌ర్ల‌తో ప్రారంభ‌మ‌వుతుంది. అటు చైనా బోర్డ‌ర్ గొడ‌వ‌, దైవ‌త్వం, దుష్ట‌శ‌క్తి, క్షుద్ర‌శ‌క్తి ఇవ‌న్నీ క‌లిసి అఖండ 2 క‌ట్ట‌గ‌ట్టేశారు. ఇక అఖండ పాత్ర‌కు ముర‌ళీమోహ‌న్ దేశం ప్ర‌మాదంలో ప‌డుతుంద‌ని.. దానిని ఎదుర్కునేందుకు మ‌రింత శ‌క్తివంతంగా మారాల‌ని ఉప‌దేశించ‌డంతో క‌థ మొద‌ల‌వుతుంది. ఇక ఇటు రెండో బాల‌కృష్ణ  ఎమ్మెల్యే బాల ముర‌ళీకృష్ణ పాత్ర సీమ‌లో గంజాయి స్మ‌గ్లింగ్‌ను అరిక‌డుతూ ఉంటాడు. ఏక‌మై కొడితే ఎవ‌రైనా ప‌డాల్సిందే అది గంజాయి మ‌త్తైనా .. మ‌ద‌మెక్కిన మృగ‌మైనా లాంటి డైలాగుల‌తో పాటు హిందూత్వం, స‌నాత‌న ధ‌ర్మం గురించి చెప్పిన డైలాగులు బాగున్నాయి.


బోయ‌పాటి సినిమా అంటేనే లాజిక్కులు వెత‌క కూడ‌దు.. అందులోనూ బాల‌య్య - బోయ‌పాటి అంటే లాజిక్‌లు వెత‌క కుండా తెర‌మీద ఏం జ‌రుగుతున్నా క‌ళ్లు అప్ప‌గించి చూసేయ‌డ‌మే. అయితే ఒక్కోసారి మ‌రీ బోర్డ‌ర్ దాటేసి బోయ‌పాటి వెళ్లిపోతూ ఉంటాడు. ఈ క్ర‌మంలోనే అఖండ 2 లో పీఎంను సైతం చాలా చీఫ్ పాత్ర గా.. భ‌య‌స్తుడిగా చూపించ‌డం బోయ‌పాటికే చెల్లింది. మ‌ణిపూర్ అల్ల‌ర్ల వెన‌క ఉన్న ఠాగూర్ అనే ప్ర‌తిప‌క్ష నేత‌ నేరుగా పీఎం కార్యాల‌యానికి త‌న త‌మ్ముళ్ల‌తో వెళ్లి .. పీఎం ముందే కాలేసుకుని.. ఈ పీఎం కుర్చీ నాకు కావాలి.. అందుకే అక్క‌డ అల్ల‌ర్లు క్రియేట్ చేస్తున్నా అంటే.. నిన్ను అరెస్టు చేయిస్తాను అని పీఎం అంటే.. పీఎంకే వార్నింగ్ ఇవ్వ‌డం చూస్తుంటే పీఎం పోస్టును బోయ‌పాటి ఇంత చీఫ్‌గా మార్చేశాడా ? అని  డౌట్ రాక‌మాన‌దు. అస‌లు మ‌నం ఏ కాలంలో ఉన్నాం.. బోయ‌పాటి ఎందుకు ఈ సీన్లు రాసుకుంటాడు అని త‌ల‌లు ప‌ట్టుకోవాల్సిందే.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: