నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన అఖండ 2 - తాండవం సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయ్యింది. గత రాత్రి నుంచే ప్రపంచ వ్యాప్తంగా ప్రీమియర్ షోలు మొదలైపోయాయి. ప్రీమియర్ల తోనే కొన్ని చోట్ల అఖండ 2 రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసింది. బాలయ్య కు కంచుకోట అయిన రాయలసీమ లో అఖండ 2 ప్రీమియర్ల తోనే దుమ్ము దులిపేసింది. మదనపల్లి లో గత రాత్రి 4 ప్రీమియర్ షోలు వేస్తే నాలుగు షోలు హౌస్ ఫుల్స్ అయ్యాయి. శ్రీ కృష్ణా లో 3,96000 /- , రవి థియేటర్లో 3,85200 /- , ఏఆర్ ఆర్ థియేటర్లో 3,12000 /- , సాయి చిత్రాలో 2,60400 /- వసూళ్లు రాబట్టింది. నాలుగు థియేటర్ల లో కలిపి ప్రీమియర్ షోలతోనే 13,53,400 /- వసూళ్లు కొల్లగొట్టింది. ఈ వసూళ్లు చూస్తుంటే బాలయ్య - బోయపాటి క్రేజ్ గురించి అఖండ 2 తాండవం గురించి మాటల్లేవ్ .. మాట్లాడుకోవడాల్లేవ్ అని చెప్పాలి.
ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా ముందు రు. 123 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. సినిమా వాయిదా పడడంతో అన్ని ప్రాంతాల్లోనూ టార్గెట్లు రివైజ్డ్ చేశారు. కుదించిన టార్గెట్ ప్రకారం చూసుకున్నా అఖండ 2 క్లీన్ హిట్ అవ్వాలంటే దాదాపు రు. 115 కోట్ల షేర్ రాబట్టాలి. అంటే రు. 200 కోట్ల కు పైగా గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టాల్సి ఉంటుంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి