ఈ విషయంలో కొన్ని అఫైషియల్ ప్రకటనలు లేవు, కానీ ఎలాంటి రియాక్షన్ రాలేదనే కారణంతో, అభిమానులు తమ ఊహాశక్తిని ఉపయోగిస్తూ వివిధ అనుమానాలు సృష్టిస్తున్నారు. కొందరు అభిమానులు ..ప్రభాస్ - త్రిషతో ప్రేమలో ఉన్నారు కానీ అది ఫెయిల్ అయిందని, మరికొందరు మాత్రం ఆయన అనుష్కను ప్రేమిస్తారని ఊహిస్తున్నారు. దీనికి సంబంధించిన వార్తలు ఎక్కువుగా వినిపిస్తూనే ఉంటాయి. ఇదిగో ప్రభాస్ పెళ్లి..అదిగో ప్రభాస్ పెళ్లి అంటూ జోరుగా వార్తలు వినిపిస్తాయి. కానీ ఇప్పటి వరకు ఏం జరగలేదు.
అయితే, వీరి కంటే ముందు ప్రభాస్ ఓ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాదు అనే పుకార్లు కూడా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించాయి. ఆయన మొదటి సినిమా “ఈశ్వర్”లో హీరోయిన్ గా నటించిన శ్రీదేవి ఆమెతో ఆయనకు మంచి సన్నిహిత సంబంధం ఉందని, స్క్రీన్‌షాట్‌లు, సినిమా సీన్‌లను చూసి అభిమానులు భావించారు. ఆ తర్వాత కొన్ని వార్తలు కూడా అలాగే వినిపించాయి. కానీ, ఈ విషయంపై ప్రభాస్ కూడా, శ్రీదేవి కూడా ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు. అందరూ తమ వ్యక్తిగత జీవితంలో బిజీ అయ్యారు. ఆ తరువాత అది అలా అలా మర్చిపోయారు. ఇప్పుడు మరోకసారి అదే రూమర్ ని బాగ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా, సోషల్ మీడియాలో అభిమానులు ప్రభాస్ పెళ్లి చేసుకుంటే బాగుంటుందేమో అనే ఆశతో, ఆయన వ్యక్తిగత జీవితాన్ని చర్చిస్తూ ఉంటారు. అభిమానుల ఆత్రుత, ఆసక్తి ఇంకా కొనసాగుతూ ఉంది. ప్రభాస్ మాత్రం ఇంకా పెళ్లి చేసుకోలేదు..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి