నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన అఖండ 2 - తాండ‌వం సినిమా బాక్సాఫీస్ దగ్గర నిజంగానే తాండవం చేస్తూ దూసుకెళ్తోంది. సినిమాకు మిక్డ్స్‌డ్‌ రివ్యూలు, మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ తొలి రోజు ఓపెనింగ్స్‌పై మాత్రం దాని ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. మేకర్స్ ప్రకటించిన లెక్కల ప్రకారం ఈ చిత్రం తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.60 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. బాల‌య్య‌ కెరీర్‌లో ఇదే హయ్యెస్ట్ డే-1 గ్రాసర్ అనే విషయంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. వీకెండ్ వరకు కూడా సినిమా నిలకడగానే వసూళ్లు రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమా మొత్తంగా చూసుకుంటే కొందరికి కొన్ని సీన్లు బాగా నచ్చాయి, మరికొందరికి కొన్ని సన్నివేశాలు కనెక్ట్ కాలేదనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. అయితే ఈ భిన్నాభిప్రాయాల మధ్య అందరూ ఏకగ్రీవంగా ప్రశంసించిన ఒకే ఒక్క ఎపిసోడ్ ఉంది. అదే… అఖండ తల్లి మరణించిన తర్వాత, తన బదులుగా స్వయంగా శివుడే వచ్చి అంత్యక్రియలు నిర్వహించే సన్నివేశం.


ఈ సీన్ సినిమాకు పెద్ద సర్ప్రైజ్‌గా నిలిచింది. థియేటర్‌లో ఆ సన్నివేశం వచ్చినప్పుడు ప్రేక్షకులు ఒక్కసారిగా నిశ్శబ్దంలోకి వెళ్లిపోవడం, భావోద్వేగానికి లోనవడం స్పష్టంగా కనిపించింది. ఆ సన్నివేశంలో శివుడి పాత్రలో కనిపించిన ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. అతని హావభావాలు, గంభీరత, స్క్రీన్ ప్రెజెన్స్ ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశాయి. అంతేకాదు, క్లైమాక్స్‌లో కూడా మరోసారి శివుడు దర్శనమివ్వడం సినిమాకు మరింత ఆధ్యాత్మిక టచ్‌ను తీసుకొచ్చింది.


ఇంతకీ శివుడి పాత్ర చేసిన నటుడు ఎవరు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ‘అఖండ 2’కి పాన్ ఇండియా అప్పీల్ తీసుకురావాలనే ఉద్దేశంతో మేకర్స్ ఉత్తరాది నటులను కీలక పాత్రల్లో ఎంపిక చేశారు. శివుడి పాత్రను పోషించింది హిందీ నటుడు త‌రుణ్ ఖాన్‌. ఆయన హిందీ టెలివిజన్ సీరియళ్లలో మంచి గుర్తింపు ఉన్న నటుడు. ముఖ్యంగా 2015లో ప్రసారమైన ‘సంతోషి మా’ సీరియల్‌లో కూడా మహా శివుడి పాత్రనే పోషించడం విశేషం. అంతేకాదు, మరికొన్ని సీరియళ్లలోనూ ఆయన శివుడి వేషంలో కనిపించారు. ఈ బ్యాక్‌గ్రౌండ్ కారణంగానే దర్శకుడు బోయ‌పాటి ‘అఖండ 2’ కోసం తరుణ్ ఖన్నాను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఫలితంగా శివుడి పాత్రకు ఆయన పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాడని, పాత్రకు పూర్తి న్యాయం చేశాడని ప్రేక్షకులు ఏకగ్రీవంగా అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, బాక్సాఫీస్ వసూళ్లతో పాటు ఈ శివుడి సీన్ ‘అఖండ 2’కి ప్రత్యేక హైలైట్‌గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: