ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మొత్తం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న అత్యంత మచ్ అవైటెడ్ ప్రాజెక్ట్ బన్ని-అట్లీ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (బన్నీ) హీరోగా, దర్శకుడిగా సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే ఈ సినిమా మీద ప్రేక్షకులు, అభిమానులు, అలాగే సినిమా వర్గాలు అపారమైన అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ప్రతి అప్‌డేట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారుతోంది.


ముఖ్యంగా ‘పుష్ప’ వంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత బన్నీ ఏ డైరెక్టర్‌తో సినిమా చేస్తాడు? ఎలాంటి కాన్సెప్ట్‌ను ఎంచుకుంటాడు? అనే ఆసక్తి మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీని ఊపేసింది. ఆ క్రమంలోనే ఫైనల్‌గా ఆ లక్కీ ఛాన్స్ అట్లీకి దక్కింది. బన్నీ–అట్లీ కాంబోలో సినిమా ఫిక్స్ అవ్వడంతో అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి.ఈ సినిమాకు సంబంధించిన హైలైట్ ఏంటంటే… ఇప్పటివరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరూ ప్రయత్నించని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కబోతుందనే టాక్. ఫర్ ద ఫస్ట్ టైమ్ అల్లు అర్జున్ ఈ సినిమాలో ట్రిపుల్ రోల్‌లో కనిపించబోతున్నారనే వార్త ఇప్పటికే అభిమానుల్లో విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది. ఒకే సినిమాలో మూడు విభిన్నమైన క్యారెక్టర్స్‌లో బన్నీ నటిస్తుండటం అంటే మాటలు కాదు, అది నిజంగా ఒక భారీ ఛాలెంజ్ అనే చెప్పాలి.



ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ఈ సినిమాలో మొత్తం ఐదుగురు హీరోయిన్స్ ఉన్నారనే రూమర్స్ బయటకు రావడం. ఈ వార్త తాజాగా సోషల్ మీడియాలో లీక్ అయ్యి ట్రెండ్ అవుతోంది. ఒక్కో క్యారెక్టర్‌కు ఒక్కో హీరోయిన్ ఉంటుందా? లేక కథ డిమాండ్ ప్రకారం ఇంతమంది హీరోయిన్స్ అవసరమయ్యాయా? అనే విషయాలపై కూడా చర్చ జరుగుతోంది.అయితే అసలు వివాదం ఎక్కడ మొదలైంది అంటే… బన్నీ ఈ సినిమాలో మూడు క్యారెక్టర్స్‌లో కనిపించబోతుండగా, అందులో ఒక క్యారెక్టర్‌ను చనిపోయే విధంగా అట్లీ స్క్రిప్ట్ రాసుకున్నాడట అనే వార్త. ఇప్పటివరకు అల్లు అర్జున్ ఇలాంటి పాత్రలో ఎక్కడా నటించలేదు. బన్నీని అభిమానులు కేవలం ఒక హీరోగానే కాకుండా, ఒక దేవుడిలా భావిస్తారు. అలాంటి బన్నీని చనిపోయే క్యారెక్టర్‌లో చూపిస్తే అభిమానులు ఊరుకుంటారా? అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.



ఇంత పెద్ద బడ్జెట్ సినిమాలో, అంత భారీ స్టార్ ఇమేజ్ ఉన్న హీరో క్యారెక్టర్‌ను చంపేయడం ఎంతవరకు సక్సెస్ అవుతుంది? ప్రేక్షకులు దాన్ని ఏ స్థాయిలో అంగీకరిస్తారు? అనే విషయాలపై కూడా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సోషల్ మీడియాలో అట్లీపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరుగుతోంది. కొందరు అభిమానులు అయితే అట్లీపై ఫుల్ ఫైర్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు.“అట్లీ తెలిసి తెలిసి అలాంటి పనికిమాలిన పని చేస్తాడా?”, “బన్నీ ఫ్యాన్స్ నుంచి సివియర్ వార్నింగ్స్ వస్తాయన్న సంగతి ఆయనకు తెలియదా?”, “బన్నీ క్యారెక్టర్‌ను చంపే సాహసం ఎవరు చేస్తారు?” అంటూ నెటిజన్లు గట్టిగా రియాక్ట్ అవుతున్నారు. చాలా మంది అయితే ఇది కేవలం రూమర్ మాత్రమే, అసలు అలాంటి సీన్ ఉండదు అంటూ అట్లీపై నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.



ఇప్పుడు చూడాల్సిన విషయం ఏంటంటే… ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది? నిజంగానే బన్నీ క్యారెక్టర్‌ను చనిపోయే విధంగా చూపిస్తారా? లేక అభిమానుల సెంటిమెంట్‌ను దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్‌లో మార్పులు చేస్తారా? అనే అంశాలు. ఈ విషయంలో అట్లీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో, అలాగే ఈ సినిమా ఫైనల్ అవుట్‌పుట్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: