ఈ సినిమాతో వెంకీ అట్లూరి తన సక్సెస్ ట్రాక్‌ను కొనసాగించేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాడని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. గతంలో వరుస హిట్స్‌తో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్న వెంకీ అట్లూరి, ఈసారి సూర్యతో కలిసి మరో హిట్ అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాడట. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా మలయాళ నటి మమితా బైజు నటిస్తోంది. ఆమె పాత్ర ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవబోతుందనే ప్రచారం కూడా జరుగుతోంది.ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు జివి ప్రకాష్ కుమార్. ఇప్పటికే ఆయన ఇచ్చిన ట్యూన్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయట. విడుదల తేదీతో పాటు ఇతర కీలక విషయాలను మేకర్స్ త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.
ఇదిలా ఉండగా, ఈ లోపే సూర్యకు సంబంధించిన మరో బిగ్ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సూర్య తన తదుపరి సినిమాను కూడా మరో తెలుగు దర్శకుడితో చేయబోతున్నాడనే వార్త తెరపైకి వచ్చింది. ఆ దర్శకుడు మరెవరో కాదు… సెన్సిబుల్ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల. సూర్య – శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్నట్లు బలమైన ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా రాజకీయ నేపథ్యంతో తెరకెక్కనున్నదని సమాచారం. శేఖర్ కమ్ముల సినిమాల్లో కనిపించే సహజత్వం, ఎమోషనల్ డెప్త్‌కు సూర్య నటన కలిస్తే ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకంగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ కాంబో కన్ఫర్మ్ అయితే, సూర్యకు ఇది నిజంగా డబుల్ జాక్‌పాట్ హిట్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇప్పటికే తెలుగు దర్శకులతో వరుసగా సినిమాలు చేస్తూ సూర్య టాలీవుడ్ మార్కెట్‌పై ఫోకస్ పెంచినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. వెంకీ అట్లూరితో ‘సూర్య 46’, ఆ తర్వాత శేఖర్ కమ్ముల సినిమాతో మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రావాలనే ప్లాన్‌లో సూర్య ఉన్నాడని సమాచారం. అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నా, ఈ వార్త మాత్రం ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.మొత్తానికి సూర్య లైనప్ చూస్తుంటే, రాబోయే రోజుల్లో తెలుగు ప్రేక్షకులకు అదిరిపోయే సినిమాలు అందించబోతున్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ కాంబోలు ఎంతవరకు నిజమవుతాయో, మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో వేచి చూడాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి