టాలీవుడ్‌లో అత్యంత వేగంగా సినిమా చిత్రీకరణను పూర్తి చేసి, రిలీజ్ చేయడంలో డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పేరు ముందుంటుంది. ఆయన డిక్షనరీలో రెండు, మూడు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసిన సినిమాలెన్నో ఉన్నాయి. సెట్స్‌కు వెళ్లిన తర్వాత చకాచకా షూటింగ్ చుట్టేయడం పూరి ప్రత్యేకత. ఆర్టిస్టుల సమయాన్ని ఎక్కువగా తీసుకోకుండా, ఎంత మంది పెద్ద ఆర్టిస్టులున్నా ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా డీల్ చేయగలడు. అమితాబ్ బచ్చన్ లాంటి లెజెండరీ నటుడిని పెట్టి సినిమా తీశాడంటేనే పూరి పనితనం అర్థమవుతుంది. పూరి సినిమాల్లో పెద్దగా సెట్స్ ఉండవు. వీలైనంత వరకూ రోడ్లు, స్టూడియోల్లోనే షూటింగ్ పూర్తి చేస్తాడు. అవసరమైతే పాటలకు మాత్రమే సెట్స్ వేస్తాడు, లేదంటే ఆ ఖర్చు కూడా నిర్మాతకు ఉండదు.
సినిమాకు పబ్లిసిటీ ఖర్చు కూడా పెద్దగా ఉండదు, అది పూర్తిగా నిర్మాతల ఇష్టం మేరకే వదిలేస్తారు. ఇప్పుడు పూరి తరహాలో వేగంగా సినిమాలు చేసే మరొక దర్శకుడు ఎవరంటే... హిట్ మెషిన్ అనిల్ రావిపూడి పేరే చెప్పాలి. పూరి విధానంలోనే అనిల్ కూడా వేగంగా షూటింగ్ పూర్తి చేయగల దర్శకుడు. సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి సెట్స్‌కు వెళ్లిన తర్వాత ఆర్టిస్టుల డేట్‌లను బట్టి షూటింగ్ చుట్టేస్తాడు. అదనంగా డేట్లు తీసుకుని నిర్మాతపై భారం వేయడు.
కథకు అవసరమైతే ఎంతైనా ఖర్చు చేయిస్తాడు, కానీ వీలైనంత తక్కువలోనే సీన్‌ను పూర్తి చేసేలా చూస్తాడు. దీనికి సంబంధించి అనిల్ రెండు రకాల ప్లాన్‌లను ముందుగానే సిద్ధం చేసి పెట్టుకుంటాడు.
షూటింగ్ పూర్తి చేసిన చిత్రాన్ని అంతే వేగంగా రిలీజ్ చేయడంలో దిట్ట. 15 ఏళ్ల కెరీర్‌లో ఎనిమిది సినిమాలు చేశాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం జరగకుండా అనిల్ తెలివిగా ప్లాన్ చేసి ముందుకెళ్తాడు. సినిమా పూర్తి చేయడం ఓ ఎత్తైతే, ఆ ప్రొడక్ట్‌ను జనాల్లోకి తీసుకెళ్లడానికి ప్రచారం పేరుతో కోట్లు ఖర్చు చేయిస్తారు. కానీ అనిల్ ఇక్కడ ఎంతో స్మార్ట్‌గా ఆలోచిస్తాడు. ప్రచారం కోసం సినిమాలో నటీనటులనే తెలివిగా వినియోగించుకుంటాడు. ఈ విషయంలో సందర్భాన్ని బట్టి రకరకాల వ్యూహాలు వేస్తుంటాడు.
తన తాజా చిత్రం మన శంవకర ప్రసాద్ గారు విషయంలో ప్రచారమంటే దూరంగా ఉండే నయనతారనే ఒప్పించి పని చేయించాడు. ఆ సినిమా ప్రారంభానికి ముందే ప్రీ-లాంచ్ ప్రమోషన్ ఎలా చేశాడో తెలిసిందే. చిరంజీవి, నయనతార లాంటి స్టార్లనే రంగంలోకి దింపి ప్రచారం చేయించాడు. ఇక రిలీజ్ సమయంలో అదే టీమ్‌తో ప్రచారం ఏ రేంజ్‌లో నిర్వహిస్తాడో చెప్పాల్సిన పనిలేదు. ప్రచారం పరంగా నిర్మాతకు కోట్ల రూపాయలు ఆదా చేయగల దర్శకుడు అనిల్ రావిపూడి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి