దక్షిణాది సినిమా రంగంలో తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని అంగీకరించకుండా గ్లామర్ హీరోయిన్స్ కు డిఫరెంట్ గా వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న ఏకైక నటి సాయి పల్లవి. వచ్చే సంవత్సరం శ్రీరాముడుగా నటిస్తున్న రణబీర్ కపూర్ పక్కన్న సీతగా సాయి పల్లవి నటిస్తున్న నేపధ్యంలో ఎంతవరకు సీత పాత్రకు ఆమె సరిపోతుంది అన్న సందేహాలు కొందరిలో ఉన్నాయి.

అయితే బాలీవుడ్ మీడియా అంచనాల ప్రకారం బాలీవుడ్ రామాయణంలో సాయి పల్లవి సీతగా నటిస్తున్న నేపధ్యంలో ఎంతవరకు సాయి పల్లవి సీత పాత్రకు సరిపోతుంది అన్న సందేహాలు కొందరిలో ఉన్నాయి. దీనితో పాన్ ఇండియా రేంజ్ లో సీత పాత్రలో సాయి పల్లవి ఎంతవరకు రాణిస్తుంది అన్న సందేహాలు బాలీవుడ్ విశ్లేషకులలో కలుగుతున్నాయి. ఈ సినిమా ఇంకా విడుదల కాకుండానే సాయి పల్లవి మరొక సాహసానికి అంగీకారం తెలుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ప్రముఖ సంగీత విద్వాంసురాలు ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి ఆధారంగా చేసుకుని ఆమె జీవితం పై బయోపిక్ పాన్ ఇండియా రేంజ్ లో తీయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించబోయే ఈ ఎమోషనల్ అండ్ మ్యూజికల్ బయోపిక్ లో సాయి పల్లవి సుబ్బలక్ష్మి పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 1916 లో మదురైలో జన్మించి కేవలం పదకొండేళ్ల వయసులోనే తల్లి ప్రోత్సాహంతో 1927 లో తిరుచిరాపల్లి రాక్ ఫోర్డ్ గుడిలో సంగీత కచేరీ చేసిన నాటి నుండి ఆమె భారతదేశపు గాన కోకిలగా ఒక వెలుగు వెలిగిన మహిళ.

2004 లో కన్నుమూసిన సుబ్బులక్ష్మి గారి జీవితంలో బయటి ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. 1916 నుండి ఆమె చనిపోయే వరకు జరిగిన అనేక యదార్థ సంఘటనలను ఆధారంగా తీయబోతున్న ఈ సినిమా మరొక సంచలనం అవుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అన్న అంచనాలు వెలువడుతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: