రికార్డు స్థాయిలో ఓవర్సీస్ బిజినెస్ :
మెగాస్టార్ సినిమాలకు ఓవర్సీస్‌లో, ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అనిల్ రావిపూడి వంటి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ తోడవ్వడంతో ఈ సినిమా బిజినెస్ లెక్కలు ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు ఏకంగా రూ. 20 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. ఇది చిరంజీవి కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డీల్స్. నార్త్ అమెరికాలో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 3.5 మిలియన్ డాలర్లు వసూలు చేయాల్సి ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా (ఇండియా మినహా) ఇతర దేశాల్లో ఈ సినిమా క్లీన్ హిట్ అనిపించుకోవాలంటే సుమారు 4.75 మిలియన్ డాలర్ల మార్కును అందుకోవాల్సి ఉంటుంది.
డైరెక్టర్ అనిల్ రావిపూడి మార్కు ఔట్ అండ్ ఔట్ కామెడీ మరియు యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. చిరంజీవి తన పాత రోజుల నాటి మాస్ మరియు కామెడీ మ్యాజిక్‌ను ఈ సినిమాలో రిపీట్ చేయబోతున్నారని టాక్. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ సినిమాలో మెగాస్టార్ సరసన నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ చాలా కాలం తర్వాత వెండితెరపై మెరవనుంది. అలాగే కేథరిన్ కీలక పాత్రలో కనిపించబోతోంది. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి మాస్ బీట్స్ అందిస్తున్నారు. సాహు గారపాటి మరియు చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమా 4.75 మిలియన్ డాలర్ల భారీ టార్గెట్‌ను అందుకుని ఓవర్సీస్‌లో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుందో లేదో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి