ప్రతి ఏడాది మొదటిలో వచ్చే సంక్రాంతి పండుగ అంటే కేవలం టాలీవుడ్ కి ఒక పండుగ మాత్రమే కాదు బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలయ్యే సినిమాలకు అసలైన పరీక్ష. ఈ సంక్రాంతిని క్యాష్ చేసుకోవడానికి స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను పోటీపడి మరి విడుదల చేస్తుంటారు. కానీ ఈమధ్య కాలంలో సంక్రాంతికి విడుదలయ్యే మొదటి సినిమాలు కొంతమంది స్టార్ హీరోలు అభిమానులను నిరాశ పరుస్తూ ఉన్నాయి. ఈ ట్రెండ్ గమనిస్తే 2018లో త్రివిక్రమ్ ,పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో విడుదలైన అజ్ఞాతవాసి సినిమాతో మొదలయ్యింది. గత రెండు మూడేళ్ల నుంచి వస్తూనే ఉంది.


2024 సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం సినిమా మాస్ ఎంటర్టైన్మెంట్గా భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే కొంతమందికి నచ్చిన మరి కొంతమందికి మిక్స్డ్ టాక్ గాని పరిమితమైంది.

2025లో రామ్ చరణ్ , డైరెక్టర్ శంకర్ కామినేషన్ లో వచ్చిన పాన్ ఇండియా చిత్రం గేమ్ ఛేంజర్. రాజకీయ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ సినిమా భారీ నష్టాన్ని మిగిల్చింది.


2026 లో ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో వచ్చిన ది రాజా సాబ్ సినిమా హర్రర్ కామెడీగా విడుదలైన ఈ చిత్రం అభిమానులను మెప్పించిన అన్ని వర్గాల ప్రేక్షకులను పూర్తిగా మెప్పించ లేకపోయిందని టాక్ వినిపిస్తోంది. కొంతమందికి రాజా సాబ్ సినిమా కొందరికి నచ్చిన కొంతమందికి కనెక్ట్ కాలేదనే విధంగా వినిపిస్తున్నాయి.



టాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాలు సంక్రాంతి బరిలో ఏ సినిమా మొదట విడుదలైన మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఈ విషయం సంక్రాంతి సెంటిమెంటుతో ముడి పెట్టడం కంటే ప్రతి చిత్రానికి సరైన కంటెంట్ ఫైనల్ జడ్జ్ అనే వాస్తవాన్ని గుర్తించాలని సినీ నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కథ బలంగా ఉంటే ఏ సీజన్ అయినా సరే బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన సినిమాలు చాలానే ఉన్నాయని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: